Pakistan: భారత్‌పై యుద్ధం చేయక తప్పదు !.. పాక్‌ సంచలన వార్నింగ్

పాకిస్థాన్‌కు సింధూ జలాలను నిలిపివేయడంపై పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ బుట్టో జర్దారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇలాగే కొనసాగిస్తే మరోసారి భారత్‌పై యుద్ధం చేయక తప్పదని హెచ్చరించారు.

New Update
Bilawal warns of war if India blocks Pakistan’s water supply

Bilawal warns of war if India blocks Pakistan’s water supply

పహల్గాం ఉగ్రదాడి ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత భారత్‌ ఆపరేషన్ సిందూర్‌ చేపట్టి పాక్‌, పీవోకేలోని తొమ్మిది ఉగ్రస్థావాలను ధ్వంసం చేసింది. అలాగే సింధూ నదీ జలాల పంపిణీని నిలిపివేయడం, పాక్‌ పౌరుల వీసాలు జారీ చేయడాన్ని రద్దు చేయడం, అటారీ వాఘా సరిహద్దు మూసివేత వంటి చర్యలు తీసుకుంది. అలాగే పాక్‌తో ఎగుమతి, దిగుమతులు నిలిపివేయడంతో సహా ఇరుదేశాల మధ్య గగనతలం కూడా మూసివేసింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్.. భారత్ చర్యల వల్ల మరింత సంక్షోభాన్ని చవిచూస్తోంది. 

Also Read: చంపేస్తా.. పట్టపగలు ఛాతిపై తుపాకి ఎక్కుపెట్టి యువతి రచ్చ.. వీడియో వైరల్!

ఇప్పటికే సింధూ నదీ జలాల పంపిణీ నిలిపివేతను మరోసారి సమీక్షించాలని పాకిస్థాన్‌.. భారత్‌కు నాలుగుసార్లు లేఖలు రాసింది. ఈ నిర్ణయం వల్ల తమ దేశంలో నీటి సంక్షోభం తలెత్తుతోందని చెప్పింది. కానీ పాక్‌ లేఖలను భారత ప్రభుత్వం పట్టించుకోలేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)ను అప్పగిస్తేనే నీటిని విడుదల చేస్తామని చెప్పింది.ఈ క్రమంలోనే తాజాగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ బుట్టో జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

పాకిస్థాన్‌కు నీటిని నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇలాగే కొనసాగిస్తే మరోసారి భారత్‌పై యుద్ధం చేయక తప్పదని హెచ్చరించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. '' భారత్‌కు నాలుగు లేఖలు రాశాం. కానీ వాళ్లు పట్టించుకోవడం లేదు. భారత్ వైఖరి ఇలాగే కొనసాగితే యుద్ధం తప్ప మరో మార్గం ఉండదు. పాకిస్థాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదు. కానీ దేశ భద్రత, నీటి హక్కుల కోసం పాక్ ఎక్కడిదాకైనా వెళ్తుంది.

Also read: ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

భారత్, పాక్ చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇరు దేశాల మధ్య చర్చల వల్లే దక్షిణాసియాలో శాంతి నెలకొంటుందని'' బిలావల్ బుట్టో అన్నారు. అలాగే ఇరుదేశాల మధ్య శాంతిని తీసుకురావాలని అమెరికాను కూడా కోరారు. అంతేకాదు ఈ అంశంలో భారత వైఖరిని ప్రపంచ దేశాలు ఖండించాలని పిలుపునిచ్చారు.  

Advertisment
తాజా కథనాలు