Telangana Crime: దారుణం.. ఆస్తిలో వాటా ఇవ్వాలని.. 7 నెలల గర్భిణిని హత్య చేసిన కొడుకులు!

తెలంగాణకి చెందిన రాములు తన మొదటి భార్య చనిపోవడంతో రెండో భార్యను పెళ్లి చేసుకున్నాడు. గర్భిణి అయిన రెండో భార్యకు పిల్లలు పుడితే ఆస్తిలో వాటా ఇవ్వాలని మొదటి భార్య కొడుకులు ఇద్దరూ దారుణంగా హత్య చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

New Update
Telangana

Telangana

నేటి కాలంలో డబ్బు, ఆస్తి కోసం సొంత వాళ్లనే హత్య చేస్తున్నారు. బంధాలు, బాంధవ్యాలు మరిచిపోయి కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. తల్లి వరుస అవుతున్న గర్భిణి అని చూడకుండా కొడుకులు దారుణంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని కరీంనగర్‌లోని టేకుర్తి గ్రామానికి చెందిన రాములుకి భార్య ఉండేది. ఈమె చనిపోయిన తర్వాత అతను తిరుమల అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.

ఇది కూడా చూడండి: Human GPS Bagu Khan : వీడో హ్యూమన్‌ జీపీఎస్‌..చొరబాట్ల దారులన్నీ వీడి మైండ్‌లోనే...

ఆస్తి కోసం గర్భిణిని..

రాములు మొదటి భార్య కొడుకులు రాజశేఖర్, రాజకుమార్‌కి ఈ రెండో  పెళ్లి ఇష్టం లేదు. దీంతో అప్పటి నుంచి ఆస్తి విషయంలో రాములు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో రాములు తన ఇంటిని రెండో భార్య తిరుమల పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాడు. దీంతో వారి మధ్య గొడవలు పెరిగాయి. రెండో భార్య మీద ఆస్తి రాయడంతో కోపంతో మొదటి భార్య కొడుకులు గర్భవతి అయిన ఆమెను దారుణంగా హత్య చేశారు. తిరుమలకు పుట్టబోయే పిల్లలు కూడా ఆస్తి పంపకాల్లో అడ్డుపడతారని రాములు మొదటి భార్య కొడుకులు రాజశేఖర్, రాజకుమార్ అనుమానించారు.

ఇది కూడా చూడండి: Crime news: ఇదెక్కడి దారుణం.. పిల్లనిస్తామని పిలిచి.. కొట్టి చంపారు భయ్యా

ఈ అనుమానంతోనే రాజశేఖర్, రాజకుమార్ తన తండ్రి రాములు ఇంట్లో లేని సమయం చూసి తిరుమల వద్దకు వెళ్లారు. ఆ తర్వాత ఆమెతో గొడవ పడ్డగా అది తీవ్రమైంది. చివరకు దారుణంగా గొంతు కోసి చంపారు. ఈ ఘటన జరిగిన తర్వాత రాములు వెంటనే ఇల్లందకుంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తిరుమల మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఆస్తి కోసం ఒక నిండు గర్భిణిని అతి దారుణంగా చంపిన మొదటి భార్య కొడుకులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు