/rtv/media/media_files/2025/08/25/boyfriend-killed-girlfriend-by-putting-bomb-in-her-mouth-2025-08-25-18-33-02.jpg)
Boyfriend killed girlfriend by putting bomb in her mouth
కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లా(Mysore District) లోని ఒక లాడ్జిలో 20 ఏళ్ల వివాహితను ఆమె ప్రేమికుడు హత్య(Boyfriend Killed Lover) చేశాడు. సోమవారం సాలిగ్రామ తాలూకాలోని భేర్యా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. బాధితురాలు రక్షిత (20) హున్సూర్ తాలూకాలోని గెరసనహళ్లి గ్రామానికి చెందినది. నిందితుడు సిద్ధరాజు పెరియపట్నం తాలూకాలోని బెట్టడపుర గ్రామానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. అయితే రక్షితకు కేరళకు చెందిన బస్ డ్రైవర్ సుభాష్‌తో పెళ్లి జరిగింది. వారికి రెండేళ్ల కుమార్తె కూడా ఉంది. సుభాష్ దుబాయ్‌లో పని చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. పెరియపట్నాకు చెందిన సిమెంట్ డీలర్ సిద్ధరాజుతో రక్షితకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరి మధ్య దాదాపు ఏడేళ్లుగా ఇల్లీగల్ ఎఫైర్ నడుస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: TG Crime: కొంత గ్యాప్ అంతే.. అదే రిపీట్... రాయితో తల పగలకొట్టి.. భర్తను చంపిన భార్య...
Boyfriend Killed Girlfriend By Putting Bomb In Her Mouth
కాగా, కొంతకాలంగా సిద్ధరాజుకు, రక్షితకు మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రక్షితను హత్య చేయడానికి సిద్ధరాజు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దాదాపు నెల రోజుల ముందు నుంచే మర్డర్ ప్లాన్ వేస్తున్న సిద్ధరాజు.. ఈనెల 23న దర్శితను లాడ్జ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. రక్షిత తన అత్తవారింట్లో రూ.22 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నాలుగు లక్షల నగదు చోరీ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. వాటిని తీసుకొచ్చి సిద్ధరాజుకే ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ డబ్బు కోసమే వీరిద్దరి మధ్య ఘర్షణ జరుగుతుందని తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Crime News : ప్రేమపేరుతో దగ్గరై..పెళ్లి చేసుకుని దూరమై..యువతి ప్రాణం తీసిన లవ్‌స్టోరీ
నిందితునికి గ్రానైట్ క్వారీలో పనిచేసిన అనుభవం ఉండటంతో అక్కడి నుంచి డిటోనేటర్(Detonator) తీసుకువచ్చినట్లు తెలుస్తుంది. ముందుగా చేతులు కట్టేసి.. నోట్లో పేలుడు పొడితో నింపిన ఎలక్ట్రిక్ డిటోనేటర్‌ను బలవంతంగా తోశాడు. దానికి ఫోన్ చార్జర్‌తో విద్యుత్ కనెక్షన్ ఇచ్చి హతమార్చాడు. దీంతో మహిళ దారుణంగా చనిపోయింది. అయితే ఆ తర్వాత రక్షిత మొబైల్ ఫోన్ పేలి చనిపోయిందని.. నమ్మించే ప్రయత్నం చేశాడు. స్థానికులు అనుమానించి నిలదీయగా తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు.
కాగా ఈ విషయమై మైసూరు పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) విష్ణువర్ధన ఎన్ మాట్లాడుతూ, “మేము నిందితుడిని అరెస్టు చేశాము. బాధితురాలికి కేరళకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది, కానీ అదే సమయంలో నిందితుడితోనూ సంబంధం కలిగి ఉంది. ఈ హత్య వెనుక గల కారణాన్ని మేము మరింత పరిశీలిస్తున్నాము. ఆమెను చంపడానికి అతను రసాయన పొడిని ఉపయోగించాడు, ప్రస్తుతం దాని స్వభావాన్ని నిర్ధారించడానికి FSL (ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ) బృందం దీనిని పరిశీలిస్తోంది.” అని వివరించారు.