/rtv/media/media_files/2025/08/23/dowry-harassment-murder-2025-08-23-20-57-31.jpg)
Dowry Harassment murder
ఒక తప్పు చేస్తున్నపుడు తమను ఎవరు చూడటం లేదనుకోవడం పొరపాటు. ఒక్కోసారి మన కంటిపాపే మన నేరాన్ని ఎత్తిచూపవచ్చు. అలాంటిదే గ్రేటర్ నోయిడా(Greater Noida) లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం గ్రేటర్ నోయిడాలోని సిర్సా గ్రామానికి చెందిన నిక్కి అనే మహిళను అత్తింటివారు కట్నంకోసం వేధించి తీవ్రంగా కొట్టి, ఆ తర్వాత సజీవదహనం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో మృతురాలి కొడుకు ఒక వీడియోలో "నాన్న మా అమ్మని తగలబెట్టారు" అని చెప్పడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ అమానుష ఘటనలో ఆమె భర్త విపిన్, అతని కుటుంబ సభ్యులు ఉన్నారని పోలీసులు నిర్ధారించారు.
Dowry Harassment Murder
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిక్కికి 2016 డిసెంబర్‌లో సిర్సా గ్రామానికి చెందిన విపిన్‌తో పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో నిక్కి కుటుంబం వారికి స్కార్పియో కారుతో పాటు భారీగా కట్నం(Dowry) ఇచ్చింది. అయినప్పటికీ ,అత్తింటివారికి సంతృప్తి లేదు. మరో రూ. 35 లక్షలు అదనంగా తీసుకురావాలని నిక్కిని వేధించడం మొదలుపెట్టారు. విపిన్ కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు నిక్కి తల్లిదండ్రులు మరో కారును కూడా కొని ఇచ్చినా, ఆమెకు వేధింపులు మాత్రం ఆగలేదు.
ఇది కూడా చూడండి: VP Election: రాధాకృష్ణన్ Vs సుదర్శన్ రెడ్డి.. ఎవరి బలం ఎంత? మైనస్ లు ఏంటి?
నిక్కి అక్క కంచన్‌కు కూడా అదే కుటుంబంలో పెళ్లి జరిగింది. కంచన్ చెప్పిన దాని ప్రకారం.. నిందితులు నిక్కిని దారుణంగా కొట్టారు, గొంతుపై కాలి వేసి తొక్కారు. దీంతో నిక్కి స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత ఆమెపై మండే పదార్థం పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన నిక్కిని పక్కింటివారి సహాయంతో మొదట స్థానిక ఆసుపత్రికి తరలించారు, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించే సమయంలో మార్గమధ్యలోనే ఆమె మరణించింది.
Also Read:Rasha Thadani: అప్పుడు మిస్.. ఇప్పుడు జాక్ పాట్! ఘట్టమనేని హీరోతో రవీనా టాండన్ కూతురు
నిక్కి సోదరి కంచన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. పోలీసులు భర్త విపిన్, అతని సోదరుడు రోహిత్, అత్త దయ, మామ సత్‌వీర్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు విపిన్‌ను వెంటనే అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. నిక్కి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
Also Read : యుద్ధానికి ఆజ్యం పోస్తూ లాభాలు సాధిస్తోంది.. భారత్ పై సుంకాలు తప్పువు.. ట్రంప్ సలహాదారు