/rtv/media/media_files/2025/02/19/nSIg7gqU4HW8lC1xHiE5.webp)
murder
AP IAS Officer:
ఐఏఎస్ (IAS) అధికారి అంటే..క్రమశిక్షణకు మారుపేరు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గాలు అన్వేషించడంలో ముందుండే వారు. కానీ, కొంతమంది ఐఏఎస్‌లు దారితప్పుతున్నారు. సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. రాజకీయ నాయకులతో అంటకాగుతూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.వారితో వాటాలు పంచుకుని నేడు కోర్టులు, జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. అయితే ఏపీకి చెందిన ఒక ఐఏఎస్ అధికారి ఏకంగా ఒక మహిళను లేపేసి జబర్ధస్త్‌గా తిరుగుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే...
Also Read: ఆదివారం ఆకాశంలో అద్భుతం.. ఆ రోజు రక్తంతో నిండిన చంద్రుడు!!
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ సీనియర్ ఐఏఎస్, కీలకమైన శాఖకు అధిపతిగా వ్యవహరించి, సీఎం పేషీలో కూడా పనిచేసిన సదరు ఐఏఎస్ అధికారి గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కుటుంబం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మహిళతోనే ఎక్కువగా గడుపుతున్నాడట. ఇదిలా ఉండగానే ఆ ఐఏఎస్ అధికారికి ఇటీవల ఓ ప్రాణాంతక వ్యాధి సోకింది. దీంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. అదృష్ట కొద్దీ చావు నుంచి తప్పుకున్నాడు. అయితే నిలువెళ్ల అనుమానం కలిగిన సదరు ఐఏఎస్‌కు ఒక అనుమానం వచ్చింది. తను ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో మహిళ వేరే వ్యక్తులతో సన్నిహితంగా ఉంటుందని అనుమానం పెంచుకొన్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో ఆ మహిళతో గొడవ పడిన ఐఏఎస్ ఆమెపై దాడి చేశాడు. కోపంతో రగిలిపోయిన ఆయన ఆమెపై దాడి చేసే క్రమంలో ఆమె తలను గోడకు బలంగా తాకడంతో, తీవ్ర రక్తస్రావంతో ఆ మహిళ మృతి చెందింది.
ఇది కూడా చూడండి:TG Dasara Holidays: తెలంగాణ స్టూడెంట్స్ కు అదిరిపోయే శుభవార్త.. దసరా సెలవులు ప్రకటించిన సర్కార్.. లిస్ట్ ఇదే
అయితే అతను ఐఏఎస్ కావడంతో తనకున్న పలుకుబడిని ఉపయోగించి తను ఎఫైర్ పెట్టుకున్న మహిళ మెట్ల మీద నుంచి కింద పడిపోయిందని ఆసుపత్రి రికార్డుల్లో రాయించారని తెలిసింది. దీంతో పోలీసులు సాధారణ ప్రమాదంగానే కేసు బుక్ చేసేలా రాయించాడని తెలుస్తోంది. ఇంత జరిగిన తనేం చేయనట్లు, ఏం జరగనట్టు ఆ ఐఏఎస్ అధికారి దర్జాగా తిరిగి విజయవాడ వెళ్లి తిరిగి విధుల్లో చేరాడని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ విషయం కాస్త మిగిలిన ఐఏఎస్‌లకు తెలియడంతో వారు సైతం నిర్ఘాంతపోతున్నారని ఆ డిపార్ట్ మెంట్‌లో అధికారులు చెవులు కొరుక్కుంటున్నారు.
ఇది కూడా చూడండి:Putin: ఇండియా, చైనా జోలికి వస్తే వదిలి ప్రసక్తే లేదని.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!