TG Crime: కొంత గ్యాప్‌ అంతే.. అదే రిపీట్... రాయితో తల పగలకొట్టి.. భర్తను చంపిన భార్య...

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఘోరం జరిగింది.భార్య తన ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా హత్యచేసి పారిపోయింది. డెయిరీ ఫామ్ లో పనిచేస్తున్న ఒక మహిళ మరో వ్యక్తితో కలసి తన భర్తను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

New Update
murder

murder

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఘోరం జరిగింది.భార్య తన ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా హత్య(wife-killed-her-husband) చేసి పారిపోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 

Also Read: ప్రేమపేరుతో దగ్గరై..పెళ్లి చేసుకుని దూరమై..యువతి ప్రాణం తీసిన లవ్‌స్టోరీ

Wife Killed Her Husband

డెయిరీ ఫామ్ లో పనిచేస్తున్న ఒక మహిళ మరో వ్యక్తితో కలసి తన భర్తను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం అజీజ్ నగర్ కు చెందిన రాజిరెడ్డి వ్యక్తి రెండు నెలల క్రితం డెయిరీ ఫామ్ ను ప్రారంభించారు. అందులో పనిచేసేందుకు మనుషులు కావాలని బీహార్ కు చెందిన ఏజెంట్ పవన్ ను సంప్రదించాడు. అతని ద్వారా దాదాపు నెల రోజుల క్రితం పూనమ్, రాకేశ్ కుమార్ దంపతులు ఫామ్ హౌస్ లో పనిచేసేందుకు వచ్చారు. అప్పటినుంచి ఫామ్‌హౌస్‌లో కూలీలుగా పనిచేస్తున్నారు. ఆగస్టు 21న రాకేష్ దంపతులతో పాటు మరో వ్యక్తి కనిపించాడని స్థానికులు చెబుతున్నారు. అయితే రెండు రోజుల క్రితం రాజిరెడ్డి తన డెయిరీ ఫామ్ వద్దకు రాగా కొత్త వ్యక్తి కనిపించాడు. అతను  ఎవరని వారిని ఆరా తీయడంతో అతను తమ బంధువు అని చెప్పడంతో రాజిరెడ్డి సరేనని వెళ్లి పోయాడు.

Also Read : AP Mega DSC Results: మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్.. ఈ లింక్ తో చెక్ చేసుకోండి!

 తర్వాతి రోజు రాజిరెడ్డి మళ్లీ ఫాం వద్దకు వచ్చాడు. అయతే  రాకేష్ కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లాడని అడిగాడు యజమాని రాజిరెడ్డి. మద్యం తాగొచ్చి తనతో గొడవ పడి ఎక్కడికో వెళ్లిపోయాడని బుకాయించింది భార్య పూనమ్‌.  రాకేష్ కు రాజిరెడ్డి కాల్‌ చేయగా  ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఏజెంట్‌కు ఫోన్ చేశాడు యజమాని రాజిరెడ్డి.  అయితే అదే రోజు సాయంత్రం మళ్లీ ఫాం వద్దకు వచ్చిన రాజిరెడ్డికి డెయిరీ ఫామ్ వద్ద ఎవరూ కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది. వెంటనే వారికి ఫోన్ చేశారు. కానీ ఫోన్ స్విచాఫ్ వచ్చింది.

 అనుమానం వచ్చి తనకు పనికి కుదిర్చిన ఏజెంట్ పవన్ కు ఫోన్ చేసి దంపతులు ఇద్దరూ కనిపించడం లేదని రాజిరెడ్డి ఆరా తీశాడు.  పవన్ తాను కనుక్కుంటానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అయితే కొద్దిసేపటి తర్వాత పవన్ ఫోన్ చేసి రాకేశ్ కుమార్ ను హత్య చేసి పూనమ్, మహేశ్ అనే వ్యక్తి మృతదేహాన్ని బావివద్ద పడేశారని చెప్పారని పవన్‌ తెలిపాడు.  వెంటనే రాజిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజిరెడ్డి బావి వద్దకు వెళ్లి చూస్తే రాకేశ్ కుమార్ మృతదేహం కనిపించింది. పోలీసులు వచ్చి రాకేశ్ కుమార్ తలపై రాయితో కొట్టి చంపినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. రాకేష్ దంపతులతో కన్పించిన ఆ మూడో వ్యక్తి ఎవరు..? హత్యతో అతనికి సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Advertisment
తాజా కథనాలు