Crime News : కేరళలో దారుణం.. అటవీ శాఖ మంత్రి మేనకోడలి కుటుంబం దారుణ హత్య.. అసలేం ఏం జరిగిందంటే..?

కేరళలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేరళ అటవీ శాఖ మంత్రి ఏకే శశీంద్రన్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మేనకోడలి కుటుంబం దారుణ హత్యకు గురైంది. మేనకోడలు శ్రీలేఖ, ఆమె భర్త  భర్త ప్రేమరాజన్ లను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపారు.

New Update
Kerala forest minister niece family

Kerala forest minister niece family

Crime News: కేరళలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.  రాష్ర్ట అటవీ శాఖ మంత్రి ఏకే శశీంద్రన్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మేనకోడలి కుటుంబం దారుణ హత్యకు గురైంది.ఆయన మేనకోడలు శ్రీలేఖ (67), ఆమె భర్త  భర్త ప్రేమరాజన్ పికె (76)లు కన్నూర్‌లోని చిరక్కల్ పంచాయతీలోని అలవిల్ నార్త్‌లో బెడ్ మీద దంపతులు విగత జీవులుగా పడి ఉన్నారు. వారి  పిల్లలు విదేశాల్లో ఉండగా కన్నూర్‌లో శ్రీలేఖ దంపతులు ఒంటరిగా నివసిస్తున్నారు. విదేశాల నుంచి వస్తున్న ప్రేమరాజన్ కొడుకును తీసుకొచ్చేందుకు..కారు కోసం శ్రీలేఖ ఇంటికెళ్లిన డ్రైవర్ ఇంటి తలుపులు మూసి ఉండడాన్ని గమనించాడు. ఎన్నిసార్లు పిలిచినా సమాధాన రాకపోవడంతో -- స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టగా మృతదేహాలు బయటపడ్డాయి. సుత్తితో తలపై కొట్టి చంపి మృతదేహాలు కాల్చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.

ఇది కూడా చదవండి:మనుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెంచడంలో శిలాజిత్.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

 ఈ ఘటనను ముందుగా డ్రైవర్ చూసి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అటవీ శాఖ మంత్రి ఎకె శశీంద్రన్ మేనకోడలు శ్రీలేఖ,  తన భర్త ప్రేమ రాజన్ తో కలిసి కన్నూర్ లో నివసిస్తున్నారు. కాగా,  ఆ దంపతుల సంతానం బహ్రేయిల్ లో ఉంటున్నారు. అయితే..  బహ్రెయిన్ నుండి వస్తున్న పిల్లల్ని తీసుకొని రావడం కోసం డ్రైవర్ కారు కోసం ఇంటికి వెళ్లాడు. బైటనిలబడి ఎన్నిసార్లు ఫోన్ చేసిన కూడా వీరి నుంచి సరైన రెస్సాన్స్ రాకపోవడంతో కిటీకి నుంచి చూడగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు రంగంలోకి దిగి ఇంట్లోకి  వెళ్లి చూడగా.. బెడ్ మీద కాలిపోయిన గాయాలతో ఇద్దరు రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉన్నారు. శరీర భాగాలు పూర్తిగా కాలిపోయి ఉన్నాయి. మరోవైపు పోలీసులు వారిని గుర్తుతెలియని వ్యక్తులు సుత్తితో కొట్టి, కాల్చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు.  ఘటన గురించి సమాచారం అందంగానే మంత్రి  హుటాహుటిన కన్నూర్ లోని ఘటన స్థలానికి బయలు దేరారు.

ఇది కూడా చదవండి:మరోసారి ఉత్తరాఖండ్‌లో భారీ క్లౌడ్ బరస్ట్.. శిథిలాల కింద వందలాది కుటుంబాలు?

మంత్రి ఇంట్లో దారుణ ఘటన జరగడంతో అధికారులు వెంటనే స్పందించారు. ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా, బుధవారం రోజున చివరిసారి వారిని  చూసినట్లు చుట్టుపక్కల వారు చెబుతున్నారు. పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీకెమెరాల్ని జల్లెడపడుతున్నారు.  ఈఘటన కేరళలో సంచలనంగా మారింది. కన్నూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి:సాఫ్ట్‌వేర్ అంటూ మోసం చేసిన పానీపూరీ భర్త.. గర్భవతి అని చూడకుండా దారుణంగా ఏం చేశాడంటే?

Advertisment
తాజా కథనాలు