/rtv/media/media_files/2025/08/26/father-kills-daughter-and-lover-2025-08-26-16-03-38.jpg)
Father kills daughter and lover
Nanded Honour Killing: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. ఒక వ్యక్తి తన కుమార్తెతో పాటు ఆమె ప్రియుడిని చంపి, వారి మృతదేహాలను బావిలో పడవేసి, ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. సోమవారం సాయంత్రం నాందేడ్‌జిల్లా ఉమ్రి తాలూకాలోని గోలెగావ్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉమ్రి తాలూకాలోని బోర్జుని గ్రామానికి చెందిన సంజీవని కమలే అనే యువతికి, గత ఏడాది గోలెగావ్ గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. అయితే సంజీవనికి అప్పటికే తన సొంత గ్రామానికి చెందిన లఖన్ బాలాజీ భండారేతో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. దీంతో లఖన్ తరుచుగా ఆమె అత్తవారింటికి వస్తూ అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ విషయం తెలిసి అత్తగారి కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి:అయ్యోపాపం.. డబ్బుల కోసం రిటైర్డ్ డీఎస్పీని కట్టేసి కొట్టిన భార్యపిల్లలు..వీడియో వైరల్
సోమవారం, మరోసారి గోలెగావ్ గ్రామానికి వచ్చిన లఖన్ బాలాజీ భండారే, సంజీవనితో ఉండగా ఆమె అత్తమామలు, భర్త పట్టుకున్నారు. అనంతరం ఆమె తండ్రి మారుతి సురానేకు ఫోన్‌లో సమాచారం అందించారు. వెంటనే, ఆ మహిళ తండ్రి, తాత, మామ సంజీవని అత్తమామల ఇంటికి వచ్చి, ఆ ఇద్దరినీ పనంద్ రోడ్డుకు అవతలి వైపున ఉన్న బోర్జుని గ్రామానికి తీసుకెళ్లారు. అనంతరం ఇద్దరినీ విపరీతంగా కొట్టడంతో చంపి, వారి మృతదేహాలను కర్కల శివార్‌లోని పెద్ద బావిలో పడేశారు. అనంతరం మారుతి స్వయంగా వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి బావిలోనుంచి సంజీవని మృతదేహాన్ని బయటకు వెలికితీశారు. అయితే అర్థరాత్రి వరకు లఖన్ మృతదేహాం దొరకలేదు. అతని మృతదేహాన్ని వెలికితీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
Also Read: కేంద్ర మాజీ మంత్రి హనుమంతుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
కాగా, ఈ విషయమై ఉమ్రి పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ అంకుష్ మానే మాట్లాడుతూ, ప్రాథమిక దర్యాప్తులో ఆ యువతి లఖన్ బాలాజీ అనే యువకుడితో కొనసాగిస్తున్న సంబంధాన్ని వారి కుటుంబం వ్యతిరేకిస్తోందని తేలిందని అన్నారు. ఏడాది క్రితం సంజీవని వివాహం చేసుకున్నప్పటికీ బాలాజీతో సంబంధం కొనసాగించిందని తెలిపారు. ఈ విషయంలో ఆమె అత్తగారు పదే పదే అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఆమె లఖన్ బాలాజీ తో తన సంబంధాన్ని కొనసాగించిందని, ప్రాథమికంగా ఇది పరువు హత్య కేసుగా భావిస్తున్నామని మానే అన్నారు. కాగా, అదనపు పోలీసు సూపరింటెండెంట్ అర్చన పాటిల్, సబ్-డివిజనల్ పోలీసు అధికారి దశరథ్ పాటిల్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఉమ్రి పోస్టాఫీస్ అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అంకుష్ మానే ఫిర్యాదు దాఖలు చేశారు. కాగా ఈ కేసులో సంజీవని తాత లక్ష్మణ్ సురానే, తండ్రి మారుతి సురానే , మామ మాధవ్ సురానేలను అదుపులోకి తీసుకున్నట్లు మానే తెలిపారు.
Also Read : Employment: నిద్రలేచింది మహిళా లోకం.. ఎంప్లాయ్‌మెంట్‌లో వాళ్లే 40శాతం