Suicide : సూర్యాపేట ఎల్కారంలో టెన్షన్..టెన్షన్!
సూర్యాపేట జిల్లా ఎల్కారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం జరిగిన మాజీ మావోయిస్టు ఎల్లయ్య హత్యపై నిరసనలు వెల్లువెత్తాయి. ఎల్లయ్య ప్రత్యర్థుల ఇళ్లపై రాళ్ల దాడులు జరిగాయి.
సూర్యాపేట జిల్లా ఎల్కారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం జరిగిన మాజీ మావోయిస్టు ఎల్లయ్య హత్యపై నిరసనలు వెల్లువెత్తాయి. ఎల్లయ్య ప్రత్యర్థుల ఇళ్లపై రాళ్ల దాడులు జరిగాయి.
వంట చేయడం ఆలస్యమైందని భార్యను హత్య చేశాడో భర్త. మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.వంట రుచిగా లేదని నవీన్ అనే వ్యక్తి భార్య తల పై ఇటుక రాయితో బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్న సనావుల్లా(24) అనే వ్యక్తిని ఇద్దరు దుండగులు మొబైల్ అడిగారు. అతడు ఇవ్వకపోవడంతో కత్తితో పొడిచి పరారయ్యారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
భార్య కాపురానికి రావట్లేదనే కోపంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. అత్త సూది కంసమ్మ నిద్రలో ఉన్నప్పుడు అల్లుడు దశరథం దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ భయంకరమైన ఘటన మెదక్ మండలం కలానుశెట్టి గ్రామంలో జరిగింది.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో సొంతతల్లినే కొడుకు కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. చెడు వ్యసానాలకు బానిసైన కొడుకు ఇటీవల ఆస్తి పంపకాలు చేయమని అడిగాడు. తల్లి నిరాకరించి కోర్టుకు వెళ్లడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీని హత్య చేసేందుకు కుట్ర పన్నిన ఓ వ్యక్తిని పోలీసులు పోలాండ్ లో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి రష్యా ఇంటెలిజెన్స్ సర్వీస్ తరుపున కుట్ర పన్నినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
భార్యను అత్యంత దారుణంగా చంపి పారిపోయిన వ్యక్తి కోసం అమెరికా పోలీసులు గత 9ఏండ్లుగా జల్లెడపడుతున్నారు. అతని ఆచూకీ ఎక్కడా లభించలేదు. అతనిపై రూ. 2కోట్ల రివార్డును కూడా ప్రకటించారు. తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు ఎక్కడున్నాడు? పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ చదవండి.
హైదరాబాద్‌లోని బహదూర్‌పురా పీఎస్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఒవైసీ మార్కెట్ సమీపంలోని అసద్‌బాబానగర్‌లో 20 ఏళ్ల ఖలీల్ అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచారు. ఈ ఘటన పాతబస్తీలో కలకలం రేపుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. సిగరెట్ కాల్చేందుకు అగ్గిపెట్టె ఇవ్వలేదని ఇద్దరు మైనర్లు దారుణానికి ఒడిగట్టారు. అగ్గిపెట్టే ఇవ్వలేదని కోపంతో రగిలిపోయిన మైనర్లు ఓ యువకుడిని కత్తితోపొడిచి చంపారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.