కొత్త సంవత్సరం ఇలా మొదలైందో లేదో అలా హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోయాయి. ఊహించలేని విధంగా ఘోరాలు, గుండెలు పగిలే సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా అలాంటి దారుణమే ఒకటి జరిగింది. కూతురిపై అత్యాచారం చేసేందుకు భర్త ప్రయత్నించాడన్న కోపంతో భర్తను ఏకంగా ముక్కలు ముక్కలుగా నరికేసి.. ఊరు చివర పడేసింది. అనంతరం ఇంటికొచ్చి ఏమీ తెలియనట్లుగా ఉంది. ఆఖరికి కటకటాలపాలైంది. ఈ సంఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. Also Read: గర్ల్స్ హాస్టల్ బాత్‌రూమ్‌లో వీడియోలు.. విద్యార్థినుల ఆందోళన శ్రీమంత్ హిట్నల్, సావిత్రి హిట్నల్ దంపతులు ఉమారాణి గ్రామంలో నివాసముంటున్నారు. వీరికి నలుగురు సంతానం. అయితే భర్త ఏ పని చేయకుండా ఇంటిదగ్గరే ఉంటాడు. అదే సమయంలో ఫుల్‌గా మద్యం సేవించి తన భార్యతో తరచూ గొడవ పడేవాడు. దీంతో ఇద్దరి భార్యా భర్తల మధ్య గొడవలు తలెత్తేవి. Also Read: బోర్‌వెల్‌లో పది రోజులు ఉన్న పాప..రెస్క్యూ చేసిన తర్వాత మృతి కూతురిపై కన్నేసిన తండ్రి ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. భార్య సావిత్రి హిట్నల్ తనకు సహకరించడానికి నిరాకరించడంతో శ్రీమంత్ హిట్నల్ తన కుమార్తెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో భర్తపై కోపం పెంచుకుంది భార్య. ఈ తరుణంలోనే గురువారం తెల్లవారు జామున ఇంట్లో నిద్రిస్తున్న భర్తపై దారుణానికి ఒడిగట్టింది. పెద్ద బండరాయితో భర్త తలను పగలగొట్టింది. దీంతో అతడు రక్తం మడుగులో గిలగిలా కొట్టుకుంటూ మృతి చెందాడు. Also Read: రైతులకు శుభవార్త.. పంట బీమా పథకాలను పొడిగించిన కేంద్రం ఆపై ఆమె మృతదేహాన్ని కనిపించకుండా చేసేందుకు ఓ ప్లాన్ వేసింది. ఆ డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి ఒక పెద్ద బకేట్‌లో వేసింది. అనంతరం ఊరి చివారుకి వెళ్లి పడేసింది. తిరిగి ఇంటికి వచ్చి రక్తాన్ని తన భర్త బట్టలతోనే శుభ్రం చేసింది. ఇక శ్రీమంత్ మృతదేహం చూసిన ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇందులో తన భర్తను చంపినట్లు ఆమె అంగీకరించింది. అలాగే అతన్ని చంపడానికి బలవంతం చేసిన సంఘటనలను పోలీసులకు వివరించింది. Also Read: న్యూఇయర్ రోజు అమెరికాలో మరో అటాక్..న్యూయార్క్ నైట్ క్లబ్‌లో కాల్పులు..