![knife](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2024/12/09/L1DcVc96AOnWien2iqLg.jpg)
Crime: కరేబియన్ దేశం హైతీలో దారుణ ఘటన చోటు చేసుకుంది.సైట్ సోలైల్ మురికివాడ పై స్థానిక గ్యాంగ్ ఒకటి విరుచుకుపడింది. కనిపించిన వారినల్లా అతి కిరాతకంగా చంపేసింది. తమ గ్యాంగ్ లీడర్ కుమారుడికి చేతబడి చేశారనే అనుమానంతోనే ఆ ముఠా సభ్యులు ఈ ఘాతూకానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ మేరకు నేషనల్ హ్యూమాన్ రైట్ డిఫెన్స్ నెట్‌వర్క్ వెల్లడించింది.
Also Read: 46 ఏళ్ళ వయసులో కోయాక్టర్ ను పెళ్లి చేసుకున్న హీరో.. ఫొటోలు వైరల్!
స్థానికంగా ఉన్న వివ్ అన్సన్మ్ గ్యాంగ్ కు మోనెల్ మికానో ఫెలిక్స్ అనే వ్యక్తి నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు.ఇటీవల అతడి కుమారుడు అనారోగ్యం బారినపడ్డాడు.దీంతో అతడు ఓ పూజారిని కలవగా...ఆ ప్రాంతంలోని వృద్దులు చేతబడి చేసి చిన్నారికి హాని కలిగిస్తున్నారని చెప్పారు.దీంతో ఫెలిక్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
Also Read: రాచరిక పాలనలో అసలైన తెలంగాణ చరిత్ర మరుగునపడింది.. పొన్నం ఫైర్
దీంతో మురికివాడలో ఉన్న 60 ఏళ్లు పైబడిన వృద్దుల పై అతడి ముఠా సభ్యులు దాడులకు పాల్పడ్డారు. శుక్ర,శని వారాల్లో రెండు రోజుల పాటు కొడవళ్లు, కత్తులతో నరికి చంపారు. ఈ ఘటనలో 110 మంది ప్రాణాలు కోల్పోయారని హ్యూమన్ రైట్ డిఫెన్స్ నెట్ వర్క్ తెలిపింది. సైట్ సోలైట్ అనేది హైతీ రాజధాని పోర్ట్ ఔ ప్రిన్స్ లోని అత్యంత రద్దీగా ఉండే మురికివాడ ప్రాంతం.
Also Read: అసెంబ్లీ దగ్గర గందరగోళం.. BRS MLAలు అరెస్ట్, ట్రాక్టర్‌పై BJP MLAలు
ఇక్కడ గ్యాంగ్ ల నియంత్రణ విపరీతంగా ఉంటుంది. కనీసం ఫోన్లు వినియోగించే పరిస్థితి కూడా ఉండదు. దీంతో ఈ మారణహోమం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.