Crime: దారుణం.. అక్క కాపురంలో అత్త చిచ్చు పెడుతుందని..

అక్క కాపురంలో అత్త చిచ్చు పెడుతుందని తమ్ముడు ఆమెను దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. అక్క, బావ మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. అత్త వల్లే గొడవలని ఆమె లేకపోతే సమస్యే ఉండదని భావించి అక్క తమ్ముడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.

New Update
attack

అత్త, కోడళ్ల మధ్య గొడవలు అనేవి సహజం. కానీ చిన్న గొడవలను కూడా కొందరు సీరియస్‌గా తీసుకుని ప్రాణాలు తీసేస్తున్నారు. ఇటీవల ఇలాంటి దారుణ ఘటనే తిరుపతిలో చోటుచేసుకుంది. తిరుపతిలోని సింగాలగుంటలో వెంకటలక్ష్మి, జోగారావు అనే దంపతులు కొబ్బరి కాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కొడుకు, కూతురు విజయ్, నాగలక్ష్మీ ఉన్నారు. వారి వీధికి చెందిన ద్రాక్షాయ‌ణి అనే ఆవిడ ఉంది. ఈమెకు పురుషోత్తమ‌నే కుమారుడు కూడా ఉన్నాడు.

ఇది కూడా చూడండి:  AP: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే!

దూరంగా ఉండాలని వేరే కాపురం..

నాగ‌లక్ష్మి, పురుషోత్తం ఇద్దరూ ప్రేమించుకుని పెద్దల సమక్షంలో 2013లో వివాహం చేసుకున్నారు. వీరికి పెళ్లయిన తర్వాత తల్లితో ఉండలేక, దూరంగా ఉండాలని వేరే కాపురం పెట్టాడు. ఫొటో ఫ్రేమ్‌లు తయారు చేస్తూ పురుషోత్తం కుటుంబ జీవనం సాగిస్తున్నాడు. అయితే నాగలక్ష్మీ భర్త దగ్గర డబ్బులు తీసుకుని పుట్టింటికి ఇస్తుందని ఇంట్లో గొడవలు జరిగేవి.

ఇది కూడా చూడండి: Ap Rains: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

రోజూ పురుషోత్తం, నాగలక్ష్మీ ఈ కారణం వల్ల గొడవ పడేవారు. ఈ గొడవలకు ముఖ్య కారణం తల్లి ద్రాక్షాయణి అని నాగలక్ష్మీ కుటుంబ సభ్యులు ఆరోపించేవారు. ఓ రోజు రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో నాగలక్ష్మీ కుటుంబ సభ్యులు ఆమెను పుట్టింటికి తీసుకెళ్లారు. అక్క, బావ మధ్య గొడవలకు కారణం పురుషోత్తం త‌ల్లి ద్రాక్షాయ‌ణి అని నాగ‌ల‌క్ష్మి త‌మ్ముడు విజ‌య్ అనుకున్నాడు.

ఇది కూడా చూడండి: Holidays: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు

ఆమె లేకపోతే అసలు అక్క, బావకు గొడవలు రావని భావించి ఆమెను చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో రాత్రి 11 గంట‌ల సమయంలో ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఆమె దగ్గరకు వెళ్లి క‌త్తితో దాడి చేశాడు. దీంతో ద్రాక్షాయ‌ణికి త‌ల‌కు తీవ్ర గాయమైంది. స్థానికులు గమనించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటూ మరణించింది. దీంతో పోలీసులు నాగలక్ష్మీ తమ్ముడి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: సౌత్‌ఇండియన్స్ వద్దంటూ జాబ్ నోటిఫికేషన్..తిట్టిపోస్తున్న నెటిజన్లు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు