/rtv/media/media_files/2024/12/31/0j2EHuGYyqzn3WyhEibx.jpg)
Nimisha Priya Death Penalty
భారతీయ నర్స్‌కు విదేశంలో కఠిన శిక్ష విధించారు. ఓ హత్యా నేరంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆమెకు ఓ దేశం మరణ శిక్ష విధించడం తీవ్ర కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన నర్స్ నిమిష ప్రియ(Nimisha Priya) యెమెన్‌లో ఓ హత్యా నేరంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశాధ్యక్షుడు రషీద్ అల్ అలిమి ఆమెకు మరణశిక్ష విధించారు. ఓ హత్యా నేరం ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆమెను అరెస్టు చేసారు. దాదాపు 2017 నుంచి ఆమె యెమెన్ జైల్లోనే ఉంటోంది. కొన్ని నెలల్లోనే ఆమెకు శిక్షను అమలు చేయనున్నట్లు సమాచారం.
Also Read: బ్యాడ్ న్యూస్ ఫర్ ఇండియా.. హిట్‌మ్యాన్, కింగ్ రిటైర్ కావడం లేదు
అయితే ఆమెను విడిపించేందుకు చాలా కృషి చేస్తున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. అనంతరం ఈ అంశంపై విదేశాంగ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పందించారు. నర్స్ నిమిష ప్రియను కాపాడేందుకు ఆమె కుటుంబం అన్ని అవకాశాలను అన్వేషించడాన్ని తాము అర్థం చేసుకుంటున్నామన్నారు. ఈ అంశంలో భారత ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.
కేసు ఏంటి?
నిమిష ప్రియా(Nimisha Priya) కేరళలో నర్స్ కోర్సు పూర్తి చేసిన తర్వాత 2008లో యెమెన్‌లో ఉద్యోగంలో చేరింది. అనంతరం 2011లో మళ్లీ తన గ్రామానికి వచ్చి థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆపై యెమెన్‌లో ఒక క్లీనిక్ తెరవాలనుకుంది. కానీ అక్కడి నిబంధనల ప్రకారం.. అక్కడి స్థానిక వ్యక్తి వ్యాపారంలో భాగస్వామిగా ఉంటేనే అది సాధ్యం అవుతుంది.
దీంతో నిమిష-థామస్ జంట అక్కడ తలాల్ అదిబ్ మెహది అనే వ్యక్తిని భాగస్వామిగా చేర్చుకుని మెడికల్ కౌన్సిల్ సెంటర్‌ను ఓపెన్ చేశారు. ఆ తర్వాత తన కూతురు వేడుక కోసం నిమిష తన భర్త థామస్ ఇండియాకు తిరిగి వచ్చారు. అనంతరం భర్త, కూతురుని ఇండియాలోనే విడిచి ఆమె యెమెన్ వెళ్లింది.
Also Read: అమిత్ షా సంచలన నిర్ణయం.. తెలంగాణలోకి 2వేల కేంద్ర బలగాలు!
తమ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్న తలాల్ అదిబ్ మెహది ఇదే అదునుగా బావించాడు. ఆమెను ఇబ్బంది పెట్టేవాడని.. డబ్బులు లాక్కొని వేధించేవాడని నిమిష కుటుంబం ఆరోపిస్తోంది. అంతేకాకుండా నిమిష పాస్‌పోర్టు కూడా అతడు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే 2016లో ఆమె అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో నిమిష 2017లో తలాల్ అదిబ్‌కు మత్తు మందు ఇచ్చి.. తన పాస్‌పోర్ట్ తీసుకోవాలని భావించింది. కానీ డోస్ ఎక్కువవడంతో అతడు మరణించాడు.
అనంతరం ఆ డెడ్ బాడీని ఓ వాటర్ ట్యాంక్‌లో పడేసింది. అక్కడ నుంచి సౌదీకి వెళ్లిపోతుండగా.. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అయితే యెమెన్‌లో మృతుడి కుటుంబానికి భారీ పరిహారం చెల్లిస్తే నిందితులను క్షమించి వదిలేసే ఛాన్స్ ఉంది. దీంతో నిమిష ఫ్యామిలీ మృతుని కుటుంబానికి 40వేల డాలర్లు (రూ.34,20,000) ఇచ్చేందుకు అంగీకరించింది. కానీ ఆ చర్చలు మధ్యలోనే ఆగిపోయాయి.