Kolkata: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఆర్జీ కార్ హత్యాచార కేసులో తాజాగా ఫారెన్సిక్ రిపోర్టు బయటకు వచ్చింది. అయితే ఇందులోని విషయాలు చూస్తే మాత్రం అంతా షాక్ అవ్వాల్సిందే. ముఖ్యంగా ఈ కేసులో నిందితుడు.. బాధితురాలని తీవ్రంగా హింసించి మరీ అత్యాచారం చేసినట్లు తెలుస్తుంది అంతేకాకుండా ఆమెను ఇష్టమొచ్చినట్లుగా కొడుతూ హత్య చేశాడు. ఇంత జరిగిన ఈ కేసులో.. క్రైమ్ సీన్‌లో ఎలాంటి పెనుగులాట జరిగినట్లు లేదని ఫోరెన్సిక్ రిపోర్టు పేర్కొంది.
Also Read: Zelensky: 3000 మందికి పైగా ఉత్తర కొరియా సైనికులు చనిపోయి ఉండొచ్చు!
ముఖ్యంగా అక్కడ పెనుగులాటకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని రిపోర్టు లో ఉంది. దీంతో అంతా షాక్ అవుతున్నారు.ఆగస్టు 9వ తేదీన నార్త్ కోల్‌కతాలోని ఆర్జీ ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఓ ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇలా ఆమె పోస్టుమార్టం నివేదికలో.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Also Read: TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం గంట నుంచి 3 గంటల్లోపే
ముఖ్యంగా ఆమె ప్రైవేటు భాగాల్లోంచి రక్తస్రావం అయినట్లు, శరీరంలోని అనేక భాగాలపైన గాయాల గుర్తులు ఉన్నట్లు తేలింది. కానీ ఇందుకు షాకింగ్ ఫోరెన్సిక్ నివేదిక ఉండడం గమనార్హం. తాజాగా వచ్చిన ఫోరెన్సిక్ నివేదికలో.. క్రైమ్ సీన్‌లో ఎలాంటి పెనుగులాట జరగలేదని, అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు తమకు దొరకలేదని స్పష్టం చేసింది. ఢిల్లీలోని CFCLకు చెందిన నిపుణులు ఆగస్టు 14వ తేదీన ఆసుపత్రిని పరిశీలించారు. ట్రైనీ వైద్యురాలిపై దాడి జరిగినట్లు చెబుతున్న సెమినార్ హాల్లోని పరుపు సహా నేరారోపణ జరిగిన ప్రదేశం నుంచి నమూనాలను తీసుకున్నారు.
Aslo Read: AP Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు!
అయితే ఈ పరుపుపై ఉన్నది బాధితురాలేనని ఫోరెన్సిక్ నిపుణులు అంటున్నారు. ఆమె శరీరం.. ఆ పరుపుపై ఉన్న కట్ మార్కులకు సమానంగా సరిపోయిందని.. ఆమె ఆ ప్రాంతంలో పడుకున్నట్లు సరైన ఆధారాలు దొరికినట్లు చెప్పారు. కానీ నిందితుడు దాడికి పాల్పడుతుండగా.. బాధితురాలు ప్రతిఘటించినట్లు గానీ, వారిద్దరి మధ్య పెనుగులాట జరిగినట్లు కానీ ఎలాంటి ఆధారాలు కనిపించలేదని పేర్కొంది. హాల్ మొత్తంలో అలాంటి ఆధారాలు ఎక్కడా దొరకలేవని వెల్లడించారు.
Also Read: Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ దాడి.. ఇద్దరు జవాన్లకు గాయాలు
దీంతో ప్రజలు అంతా షాక్ అవుతున్నారు. హత్యాచార బాధితురాలు ప్రతిఘటించకపోవడం ఏంటని, అసలు అత్యాచారం అక్కడే జరిగిందా లేదా అనే అనుమానాలను వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఇటీవలే ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న ఇద్దరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కోల్‌కతాలోని వైద్యులు అంతా పది రోజుల పాటు నిరసనలు చేపడుతున్నారు. మరో రెండ్రోజుల పాటు ఈ ధర్నాలు కొనసాగనున్నాయి.