Canada: కెనడాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య

కెనడాలో భారతీయులపై దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా పంజాబ్‌కు చెందిన గురాసిస్ సింగ్‌గా అనే విద్యార్థిని సహచర విద్యార్థి కత్తితో పొడిచి హత్య చేశాడు.రక్తపు మడుగులో పడి ఉన్న భారతీయ విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

New Update
Wife Murder: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

Canada: కెనడాలో భారతీయులపై దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. నిత్యం భారతీయులను ఏదోక విధంగా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మరో భారతీయ విద్యార్థిని హత్య కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్నియాలో భారతీయ విద్యార్థిని కత్తితో పొడిచి చంపారు. బాధితుడిని పంజాబ్‌కు చెందిన గురాసిస్ సింగ్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే కొందరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న భారతీయ విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

Also Read: Ap Rains: బంగాళాఖాతంలో మరో వాయుగుండం..ముంచుకొస్తున్న మూడు తుపాన్లు!

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 1న ఈ ఘటన జరిగినట్లు సర్నియా పోలీసులు తెలిపారు. భారతీయ విద్యార్థి గురాసిస్‌ సింగ్‌ సర్నియాలోని లాంబ్‌టన్‌ కళాశాలలో మొదటి సంవత్సరం బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విద్యను అభ్యసిస్తున్నాడు. అయితే సహచరుడైన క్రాస్‌లీ హంటర్‌తో కలిసి.. క్వీన్ స్ట్రీట్‌లోని ఓ గదిలో ఇద్దరు ఉండేవారు. వంటగదిలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో గురాసిస్ సింగ్‌ రూమ్మేట్ అతనిపై కత్తితో ఒక్కసారిగా దాడికి దిగాడు. తీవ్ర గాయాలపాలై విద్యార్థి మృతి చెందాడు.

Also Read: Google Maps: మరోసారి దారి తప్పించిన గూగుల్‌ తల్లి..ఈసారి అడవి పాలు!

ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవకు కారణమేమిటనేది కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే అన్ని రకాల ఆధారాలు సేకరించేందుకు పోలీసులను మోహరించారు. “ఈ దాడికి జాతి వివక్షతో సంబంధం లేదు” అని సర్నియా పోలీస్ చీఫ్ డెరెక్ డేవిస్ అన్నారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు హంటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుణ్ణి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లండన్‌లోని అంటారియో కోర్ట్ ఆఫ్ జస్టిస్ ముందు పరిచారు.

Also Read: Telangana: ప్రొడ్యూసర్‌ దిల్‌రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి

గురాసిస్‌ సింగ్‌ మృతికి సంతాపం తెలుపుతూ లాంబ్‌టన్‌ కాలేజీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అతని కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. తమ కళాశాల సింగ్ కుటుంబంతో టచ్‌ లో ఉన్నట్లు తెలిపింది.

Also Read: Ap: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు అలర్ట్..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు