Chhattisgarh: జర్నలిస్ట్ ముకేశ్ హత్య కేసులో వెలుగులోకి భయానక విషయాలు..

బీహార్ జర్నలిస్ట్ ముకేశ్ చంద్రకర్ హత్య కేసులో భయానక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతన్ని చంపేసిన తర్వాత గుండెను బయటకు తీసి...కాలేయాన్ని నాలుగు ముక్కలు చేశారు.  15 చోట్ల తల పగిలేలా కొట్టి.. పక్కటెముకలు, మెడ విరిచి దారుణంగా హత్య చేశారు.

author-image
By Manogna alamuru
New Update
journalist

Mukesh Chandrakar

ఇంత దారుణమైన హత్య ఎప్పుడూ చూడలేందటున్నారు డాక్టర్లు.  ఇంతలా భయానకంగా ఎలా చంపారో అంటూ ఆశ్చర్యపోతున్నారు. పోస్ట్ మార్టం చేయడానికి కూడా భయపడ్డామని తెలిపారు జర్నలిస్ట్ ముకేశ్ చంద్రకర్‌‌కు ప్రొసీజర్ చేసిన వైద్యులు. బయటకు తీసిన గుండెను బయటకు తీశారు, కాలేయాన్ని నాలుగు ముక్కలు చేశారు.. 15 చోట్ల పగిలిన తల.. విరిగిన పక్కటెముకలు, మెడ...ఇలా దారుణంగా ఉంది అతని శరీరం పరిస్థితి అని వివరించారు. ఇంత భయానక హత్య ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. 

రాడ్డుతో చితకబాద..సెప్టిక్ ట్యాంకులో...

మరోవైపు ఈ కేసులో ప్రధాని నిందితుడు సురేశ్ చంద్రకర్‌‌ను సిట్ బృందం హైదరాబాద్‌లో అరెస్ట్ చేసింది. ఇతని కన్నా ముందు మరో ఇద్దరు నిందితులు రితీస్, దేనేశ్‌ చంద్రకర్‌‌లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారు చెప్పిన వివరాల ప్రకారం...ముందుగానే పథకం వేసుకుని రితీశ్ , మహేంద్రలు  ముకేశ్‌ను భోజనం చేద్దామని సురేశ్ ఇంటికి తీసుకుని వెళ్ళారు. అక్కడ అతనితో వాగ్వాదం పెట్టుకున్నారు. ఆ వేడిలో ముకేశ్ మీద అందరూ కలిపి రాడ్డుతో దాడి చేశారు. ఆ తర్వాత అతన్ని సెప్టిక్ ట్యాంకులో వేసి సిమెంట్‌తో కప్పేశారు. ఇది అయిన వెంటనే సురేశ్ పారిపోయి హైదరాబాద్ వచ్చి దాక్కున్నాడు. ఇక్కడ ఉన్న అతని డ్రైవర్ ఇంట్లో సురేశ్ తల దాచుకున్నాడు. 

Also Read: USA: హెచ్–1 వీసాదారులకు గుడ్‌ న్యూస్.. స్టాంపింగ్‌ ఇక అమెరికాలోనే...


 ముకేశ్‌ను హత్య చేసిన వారందరూ అతని బంధువులే. ముకేశ్ జర్నలిస్ట్, ఇంకా బస్తర్ జంక్షన్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా నిర్వహిస్తూ ఉండేవాడు. ఇతను గంగలూరు నుంచి హిరోలి వరకు రూ.120 కోట్లతో చేపట్టిన ఓ రోడ్డు ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందంటూ గత ఏడాది డిసెంబరు 25న కథనాన్ని ప్రసారం చేశాడు. ఆ రోజు నుంచే తన అన్న ముకేశ్ కనిపించడం లేదంటూ యుకేశ్ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మూడు రోజుల తర్వాత సురేశ్ ఇంటి ఆవరణలో ఉన్న సెప్టిక్ ట్యాంకులో అతని శవాన్ని కనుగొన్నారు.  ఈ హత్యకు కారణం ముకేశ్ బయటపెట్టిన అవినీతి ప్రాజెక్టు. ఇందులో ప్రధాన నిందితుడు సురేశ్ కూడా భాగస్వామిగా ఉన్నాడు. 

Also Read: Canada: ఇన్ని గొడవలతో ఇక పోరాడలేను–ట్రూడో

#murder #journalist #chhattisghar #today-latest-news-in-telugu
Advertisment
తాజా కథనాలు