/rtv/media/media_files/2025/07/27/water-fall-2025-07-27-09-06-28.jpg)
Mahitha Water Falls
ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో ఉన్న మహితపురం జలపాతం ఉంది. దీని దగ్గరకు వెళ్లడానికి ఎవరికీ అనుమతి లేదు. మహితపురం జలపాతం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉండటం వల్ల, ఇక్కడకు వెళ్లడానికి అటవీ శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. అయితే దీనిని పట్టించుకోని వరంగల్ ఏడుగురు విద్యార్థులు జలపాతానికి బయలుదేరారు. వీరిలో ముగ్గురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారు. వీళ్ళు జలపాతం దగ్గరకు వెళ్ళడం అయితే వెళ్ళారు. అక్కడ ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. కానీ తిరిగి వచ్చే క్రమంలో వారు అడవిలో దారి తప్పారు. దగ్గరలో ఉన్న గ్రామస్థుల నుంచి దారి తెలుసుకుని రావడానికి వేరే అటవీ మార్గం ద్వారా తిరిగి వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే రాత్రి అయిపోయింది. దారి కనిపించలేదు. దీంతో భయాందోళనలకు గురై రాత్రి తొమ్మిది గంటల సమయంలో 100 కాల్ చేసి సహాయం కోరారు.
వర్షంలో రెస్క్యూ ఆపరేషన్..
విద్యార్థుల నుంచి కాల్ రాగానే గోపాలపురం పోలీసులు అలెర్ట్ అయ్యారు. వెంటనే అటవీశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. విద్యార్థులు పంపిన లొకేషన్ ఆధారంగా, అటవీ శాఖ అధికారుల సహాయంతో పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌ను చేశారు. దట్టమైన అడవిలో, భారీ వర్షమున్నా శ్రమించి విద్యార్థులను కాపాడారు. రెస్క్యూ చేసిన తర్వాత, విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి, వారి భయాందోళనలను తగ్గించే ప్రయత్నం చేశారు అధికారులు. అనంతరం, విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించి, వారిని సురక్షితంగా ఇంటికి పంపించారు.
Also Read: Kingdom: ఏ నా కొడుకూ ఆపలేరంటూ..విజయ్ దేవరకొండ మళ్ళీ బలుపు మాటలు