మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరిలో ఆరుగురు యువకులు గల్లంతు
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లిలో గల మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి నదిలో ఆరుగురు యువకులు గల్లంతు అయ్యారు. పది మంది శుక్రవారం సాయంత్రం నదిలో స్నానానికి వెళ్తే అందులో ఆరుగురు యువకులు తిరిగి బయటకు రాలేదు. వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి.