/rtv/media/media_files/2025/05/19/UQBVW5CbaUenocVF5UVV.jpg)
Family Missing
TG CRIME: సిద్దిపేట జిల్లాలో ఒక కుటుంబం అదృశ్యమైంది. అప్పులు ఎక్కువయ్యాయని వడ్డీలు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో వారు ఇల్లు వదిలి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కాగా అదృశ్యమైన వారిలో భార్యాభర్తలు బాలకిషన్, వరలక్ష్మిలతో పాటు వారి పిల్లలు శ్రవణ్ కుమార్, కావ్య, శిరీష ఉన్నారు. వీరు సిద్దిపేటలోని ఖాదర్ పుర వీధిలో ఉండేవారని, అప్పులు ఎక్కువ కావడంతో ఇల్లు వదిలి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా వారంతా ఇల్లు వదిలివెళ్లే సమయంలో అందరి ఫోన్లు ఇంట్లోనే పెట్టి పోవడంతో వారి ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా మారింది.
ఇది కూడా చదవండి: ఇంట్లోనే నాణ్యమైన నెయ్యి.. ఈ చిట్కాతో తయారీ సులభం
రెండు రోజులుగా పలువురు ఫోన్లు చేస్తున్నా కుటుంబసభ్యులెవ్వరూ ఫోన్లు ఎత్తకపోవడంతో వారంతా ఇంటికి వచ్చారు. బంధువులు ఇంటికి వచ్చేసమయానికి ఇంటికి తాళం పెట్టి ఉండడం కాల్ చేస్తే ఇంట్లోనుంచి మొబైల్ కాల్స్ వినపడడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అనుమానంతో ఇంటి డోర్ పగలగొట్టి చూడగా ఇంట్లో ఎవరు లేకపోగా ఫోన్లతో పాటు ఒక లేటర్ దొరికింది. ఆ లేటర్ ను బట్టి వారంతా ఇల్లు వదిలి వెళ్లిపోయినట్లు తెలిసింది.
ఇది కూడా చూడండి: KL Rahul: టీ20ల్లో కోహ్లీ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన KL రాహుల్.. జీటీపై భారీ సెంచరీ!
కాగా వీరబత్తిని బాలకిషన్ రాసిన లేటర్ సారాంశాన్ని బట్టి తమకు అప్పులు ఎక్కువయ్యాయని, తనకు డబ్బులు ఇచ్చేవారు ఇవ్వకపోవడంతో వడ్డీలు కట్టలేకపోతున్నానని పేర్కొన్నారు. కానీ తాను ఇవ్వాల్సిన వారు తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారని అందుకే ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నామని రాసి ఉంది. కాగా బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం ముమ్మర గాలింపులు చేపట్టారు. పోన్లు ఇంట్లోనే పెట్టి వెళ్లడంతో వారిని వెతికిపట్టుకోవడం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడే అవకాశం ఉందన్న అనుమానంతో బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. కాగా వారి చుట్టూ పక్కల ఉన్న సీసీ టీవీ పుటేజీలతో పాటు బస్టాండ్ ఇతర ప్రాంతాల్లో ఉన్న కెమెరాలను జల్లడపడుతున్నారు.
ఇది కూడా చూడండి: West Indies: వెస్టిండీస్‌కు కొత్త కెప్టెన్.. 2 ఏళ్ల విరామం తర్వాత సారథిగా జట్టులోకి!