couple missing : హ‌నీమూన్ కు వెళ్లి అదృశ్యమయ్యారు

కొత్తగా పెళ్లయిన ఒక జంట హ‌నీమూన్ కోసం వెళ్లి ద‌ట్టమైన అడ‌వుల్లో అదృశ్యమైంది. న‌వ దంప‌తుల ఆచూకీ తెలియ‌క‌పోవ‌డంతో.. కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ లో చోటు చేసుకుంది. జంట ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

New Update
Indore couple goes missing in Meghalaya

Indore couple goes missing in Meghalaya

couple missing : కొత్తగా పెళ్లయిన ఒక జంట హ‌నీమూన్ కోసం వెళ్లి ద‌ట్టమైన అడ‌వుల్లో అదృశ్యమైంది. న‌వ దంప‌తుల ఆచూకీ తెలియ‌క‌పోవ‌డంతో.. కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ లో చోటు చేసుకుంది.


 ALSO READ: ఈసారి ఆర్సీబీ కప్​ గెలుస్తుందా? చాట్​జీపీటీ ఆన్సర్‌‌కు ఫ్యాన్స్ అవాక్!

వివరాల ప్రకారం...మ‌ధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా ర‌ఘువంశీ అనే వ్యక్తికి సోన‌మ్ అనే యువ‌తితో మే 11వ తేదీన వివాహ‌మైంది. పెళ్లి అయ్యాక వీరిద్దరూ మే 20న హ‌నీమూన్ కోసం బ‌య‌ల్దేరారు. అసోం రాజ‌ధాని గువ‌హ‌టి మీదుగా షిల్లాంగ్ చేరుకున్నారు. షిల్లాంగ్ వెళ్లే ముందు గువ‌హ‌టిలో కామాఖ్యా అమ్మవారిని ద‌ర్శనం కూడా చేసుకున్నారు. ఇక్కడి వరకు భాగానే సాగిన వీరి ప్రయాణం తర్వాత వీరు చిరాపుంజి వెళ్లాలనుకున్నారు. షిల్లాంగ్‌ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరాపుంజిలోని సోహ్రాకు వెళ్లడానికి స్థానికంగా ఒక యాక్టివాను అద్దెకు తీసుకున్నారు. అయితే వీరు ప్రయాణించే మార్గం దట్టమైన అటవీ ప్రాంతం కావడం గమనార్హం. అలాంటి మార్గంలో ఇద్దరూ యాక్టివాపై బయలుదేరారు.

ALSO READ: స్టూడెంట్స్ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న ట్రంప్..వీసా ఇంటర్వ్యూలు నిలిపేయాలని  ఆదేశం

అయితే మరునాడు ఉదయం సోహ్రారిమ్ అనే గ్రామానికి దగ్గర ఆ నవదంపతులు ప్రయాణించిన యాక్టివా పడిఉండటం కనిపించింది. కానీ, ఆ దంపతులు మాత్రం అదృశ్యమయ్యారు. రాజా, సోన‌మ్ అదృశ్యంపై స్పందించిన రాజా తల్లి రీనా మాట్లాడుతూ వారు త‌మ‌తో మే 23వ తేదీన చివ‌రిసారిగా మాట్లాడిన‌ట్లు తెలిపారు.ఆ తర్వాత వారి ఆచూకీ లేకుండా పోయిందని, వారి నుంచి ఎటువంటి కాల్స్‌ లేవని వాపోయారు. వారితో మాట్లాడడానికి క‌మ్యూనికేష‌న్ లేకుండా పోయింద‌ని విల‌పించారు. ఆ మరునాడు కూడా వారి ఫోన్లు స్విచ్ఛాఫ్‌గా అనే వస్తున్నాయన్నారు. దీంతో ఆందోళ‌న‌కు గురైన వారి కుటుంబ సభ్యలు మేఘాల‌య పోలీసుల‌కు ఫిర్యాదు చేశామ‌న్నారు. కాగా వారికోసం పోలీసులు, బంధువులు క‌లిసి సోహ్రా ప్రాంతంలో గాలిస్తున్నారు. కాగా మేఘాల‌యాలోని ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లాలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వ‌ర‌కు రెండు జంట‌లు అదృశ్యమ‌య్యాయి.

ALSO READ: ఎన్టీఆర్‌ జయంతి.. జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళి

అయితే సోహ్రా ప్రాంతంలో ఉన్న దట్టమైన అడవులు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. అదే సమయంలో ఈ అడవి ప్రమాదకరమైందని పోలీసులు చెబుతున్నారు. అడవిలో ద‌ట్టంగా చెట్లు, లోతైన లోయ‌లు ఉండ‌డంతో గాలింపు క‌ష్టంగా మారాయ‌న్నారు.  ఆ జంట చివ‌రి లోకేష‌న్ ఓస్రా హిల్‌లో చూపిస్తుంది. ఇది అత్యంత ప్రమాద‌క‌ర‌మైన ప్రాంతం అని పోలీసులు అంటున్నారు. ఇక్కడ ఉండే ఓ రిసార్ట్‌కు నేర చ‌రిత్ర ఉంద‌ని,  అక్కడి సిబ్బందిని విచారిస్తున్నామ‌ని పోలీసులు పేర్కొన్నారు. ఆ జంట అద్దెకు తీసుకున్న యాక్టివా నంబ‌ర్ ఆధారంగా.. దాని య‌జ‌మానిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న జంట హనీమూన్‌ వెళ్లి  అదృశ్యమవడం సంచలనం సృష్టిస్తోంది.

Also Read: తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు.. RDXతో పేల్చేస్తామన్న దుండగులు

Advertisment
Advertisment
తాజా కథనాలు