Delhi: ఢిల్లీలో మిస్సింగ్ కలకలం.. ఏడాది ప్రారంభంలోనే వందల మంది యువతులు అదృశ్యం!

2026 సంవత్సరం ప్రారంభమైన మొదటి 27 రోజుల్లోనే ఢిల్లీలో మొత్తం 807 మంది తప్పిపోయినట్లు కేసులు నమోదయ్యాయి. అంటే సగటున ప్రతిరోజూ 27 మంది అదృశ్యమవుతున్నారు. వీరిలో పోలీసులు ఇప్పటివరకు 235 మందిని మాత్రమే గుర్తించగలిగారు.

New Update
Missing

Missing

దేశ రాజధాని ఢిల్లీలో అదృశ్యమవుతున్న వ్యక్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. ముఖ్యంగా చిన్నారులు, యువతులు అదృశ్యం కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే వందలాది మంది అదృశ్యమైనట్లు పోలీసులు గుర్తించారు.  2026 సంవత్సరం ప్రారంభమైన మొదటి 27 రోజుల్లోనే ఢిల్లీలో మొత్తం 807 మంది తప్పిపోయినట్లు కేసులు నమోదయ్యాయి. అంటే సగటున ప్రతిరోజూ 27 మంది అదృశ్యమవుతున్నారు. వీరిలో పోలీసులు ఇప్పటివరకు 235 మందిని మాత్రమే గుర్తించగలిగారు. మిగిలిన 572 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. కనుగొన్న వారి కంటే ఆచూకీ తెలియని వారి సంఖ్య ఎక్కువగా ఉంది. చిన్నారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

ఇది కూడా చూడండి: U19 World Cup 2026: ఆఫ్ఘన్‌ను ఊడ్చేసిన భారత కుర్రాళ్లు..  ఫైనల్లో భారత్ vs ఇంగ్లాండ్!

ఇది కూడా చూడండి: Donald Trump : నీ ముఖంలో ఎప్పుడూ నవ్వు ఉండదు.. జర్నలిస్టుపై ట్రంప్ ఫైర్!

పెరుగుతున్న కేసులు..

కేవలం 27 రోజుల్లోనే 191 మంది మైనర్లు కనిపించకుండా పోయారు. వీరిలో 48 మందిని మాత్రమే పోలీసులు కనిపెట్టగలిగారు. మిగిలిన 137 మంది చిన్నారుల జాడ ఇంకా లభ్యం కాలేదు. వీరిలో 120 మంది బాలికలే ఉన్నారు. అయితే అక్రమ రవాణా కోసమే కిడ్నాప్ చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదృశ్యమవుతున్న పిల్లల్లో12 నుంచి 18 ఏళ్ల లోపు ఉన్న కౌమార దశ వారు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ వయస్సు వారు 169 మంది తప్పిపోగా, 0 నుంచి 12 ఏళ్ల లోపు ఉన్న చిన్న పిల్లలు సుమారు 22 మంది అదృశ్యమయ్యారు. ఢిల్లీలో ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది. 2016 నుంచి 2026 మధ్య కాలంలో ఢిల్లీలో మొత్తం 60,694 మంది చిన్నారులు తప్పిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. అందులో 53,763 మందిని పోలీసులు గుర్తించారు. కానీ మిగతా వారిని గుర్తించలేదు. 

ఇది కూడా చూడండి: Mahesh kumar Goud : పవన్‌ ఆంధ్ర నాయకుడు.. తెలంగాణ వ్యతిరేకి:  మహేష్ కుమార్ గౌడ్ కీలక కామెంట్స్

Advertisment
తాజా కథనాలు