/rtv/media/media_files/2025/10/12/drowning-2025-10-12-21-15-14.jpg)
Drowning
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని బాపట్ల జిల్లా చీరా మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. వాడరేవు తీరంలోని సముద్రం(sea)లో స్నానానికి దిగి ముగ్గురు మృతి చెందడం కలకలం రేపింది. మరో ఇద్దరు గల్లంతయ్యారు(missing). ఇక వివరాల్లోకి వెళ్తే.. అమరావతిలోని విట్ యూనివర్సిటీకి చెందిన 10 మంది విద్యార్థులు వాడరేవుకు వచ్చారు. స్నానం కోసమని సముద్రంలోకి దిగారు. అయితే వాళ్లలో హైదరాబాద్‌కు చెందిన శ్రీ సాకేత్, జీవన్ సాత్విక్, సాయి మణిదీప్, అలల తాకిడికి కొట్టుకుపోయారు. స్థానికంగా ఉన్న మత్స్యకారులు, గజ ఈతగాళ్లు వాళ్లని కాపాడేందుకు యత్నించారు.
Also Read: నువ్వేం తండ్రివి రా.. భార్య విడిచి వెళ్లిందనే కోపంతో ముగ్గురు పిల్లలను గొంతు కోసి హత్య
Two Students Are Missing In Beach
కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. గల్లంతైన కాసేపటికి వాళ్ల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఆ మృతదేహాలను చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో విద్యార్థి సోమేష్, చీరాలకు చెందిన గౌతమ్ సముద్రంలో గల్లంతయ్యారు. వీళ్ల కోసం అగ్నిమాపక, మత్స్యశాఖ అధికారులు గాలిస్తున్నారు.
Also Read: బీహార్ ఎన్నికలు.. బీజేపీ, జేడీయూ స్థానాలు ఖరారు
ఇదిలాఉండగా తెలంగాణలో కూడా ఇద్దరు యువకులు మూసీలో దిగి గల్లంతయ్యారు. ఆదివారం హిమాయత్ సాగర్ బ్యాక్ వాటర్ మూసీలోకి ఇద్దరు వ్యక్తులు దిగారు. ఈత కొడదామనుకున్నారు. కానీ కొద్దిసేపటికే వాళ్లు కనిపించకుండా పోయారు. చివరికి గత ఈతగాళ్లు, NDRF బృందాలు గల్లంతైన వారి కోసం గాలించారు. కానీ వాళ్ల ఆచూకీ కనిపించలేదు. యువకుల వివరాలు తెలియాల్సి ఉంది.