వరంగల్ దశ తిరిగినట్టే.. విమానాశ్రయం.. ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్డు సహా!
రేవంత్ సర్కార్ తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్‌ను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగు రోడ్డు, విమానాశ్రయం నిర్మాణం వంటి విషయాలపై రాష్ట్ర మంత్రులు తాజా సమావేశంలో చర్చించారు.