రేవంత్, చంద్రబాబు మధ్య చిచ్చు పెట్టిన పొంగులేటి, కోమటిరెడ్డి.. సోషల్ మీడియాలో దుమారం!

వరదల తర్వాత అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు భయపడుతున్నారంటూ పొంగులేటి చేసిన కామెంట్స్ పై TDP నేతలు భగ్గుమంటున్నారు. ఇంకా NTR ఘాట్ కూల్చి అసెంబ్లీ కట్టాలన్న రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

New Update
AP Politics

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ పై ఏపీ టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇటీవల పొంగులేటి అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ చిట్ చాట్ లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఏపీలో భారీగా పెట్టుబడులు వెళ్తాయని ప్రచారం జరిగిందన్నారు. కానీ విజయవాడలో వరదల తర్వాత పరిస్థితి మారిందన్నారు. హైదరాబాద్ కు పెట్టుబడులు భారీగా వస్తున్నాయన్నారు. దీంతో ఇది అమరావతి బ్రాండ్ ను దెబ్బతీసే కుట్రేనంటూ ఏపీ టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.
ఇది కూడా చదవండి: ఆ 3.50 లక్షల మంది పెన్షన్లు రద్దు.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం!

టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర అయితే.. జగన్ మోహన్ రెడ్డి మిత్రత్వం వాసనలు ఇంకా పోలేదా ...?? అంటూ తన X ఖాతాలో పొంగులేటిపై ఫైర్ అయ్యారు. జగన్ మోహన్ రెడ్డి అనుంగులు విధిగా చేసే వ్యాఖ్యలే ఇపుడు పొంగులేటి చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వ్యాఖ్యలు హాస్యాస్పదం, ఉద్దేశ్యపూర్వకమన్నారు. గతంలో వైసీపీ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సర్కార్ పై బురద జల్లేందుకు ఆయన కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న విమర్శలు టీడీపీ నేతల నుంచి వ్యక్తం అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: రోడ్డెక్కిన రేవంత్ రెడ్డి.. మంత్రులు, కీలక నేతలతో కలిసి భారీ ర్యాలీ!

ఈ వ్యాఖ్యల వేడి చల్లారక ముందే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో ఎన్టీఆర్ ఘాట్ ను లేపేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కడ అసెంబ్లీ కట్టాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ, ఎన్టీఆర్ అభిమారులు తీవ్రంగా మండిపడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి టార్గెట్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

గురు, శిష్యుల మధ్య చిచ్చు..

మరోవైపు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సర్కార్ మధ్య ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు చోటు చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు ఇరు ప్రభుత్వాల మధ్య వివాదాలను తీసుకువచ్చే అభిప్రాయం కూడా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గురు శిష్యులైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య ఈ ఇద్దరు నేతల వ్యాఖ్యలు చిచ్చు పెట్టాయన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ అవుతారన్న ఉత్కంఠ రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతోంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు