/rtv/media/media_files/2025/04/27/j6vEkIaE5i6XqB2O2tg7.jpg)
Indiramma House
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రభుత్వం మరో మెలిక పెట్టింది. ఇంటిని 600 చదరపు అడుగుల్లోపు నిర్మిస్తేనే ప్రభుత్వ సాయం అందుతుందని హౌసింగ్ కార్పోరేషన్ ఎండీ గౌతమ్ స్పష్టం చేశారు. 600 చ.అడుగులు దాటితే పథకానికి అనర్హులని తెలిపారు. రాష్ట్రంలో 2.832 మంది బేస్‌మెంట్ నిర్మాణాలు పూర్తి చేయగా అందులో 285 మంది ఎక్కువ విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేస్తు్న్నట్లు తనిఖీల్లో తేలిందన్నారు. వీరికి ప్రభుత్వం నుంచి సాయం అందడంలో ఇబ్బందులు వస్తాయని చెప్పారు. కొందరు అవగాహన లోపంతో ఉన్నంత స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టి, ఇప్పుడు విషయం తెలిసి నిరాశ చెందుతున్నారు. లబ్ధిదారులకు ఇంటి నిర్మాణంపై అవగాహన కల్పించకపోవడంతో సమస్య ఎదురవుతోందని, ఇలా నిర్మించిన వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!
లబ్ధిదారుల లబోదిబో..
ఈ పథకంలో భాగంగా సొంత ఇంటి స్థలం కలిగి ఉన్న పేదవారు 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో వారికి ఇష్టమొచ్చినట్లు ఇల్లు నిర్మించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లబ్ధిదారులకు పలు విడతల్లో రూ.5 లక్షల సాయం అందించనున్నట్లు పేర్కొంది. అయితే కొందరు మాత్రం 600 చదరపు అడుగులకు మించి నిర్మాణం చేపట్టారు. దీంతో వీరికి మొదటి విడతగా పునాది స్థాయిలో చెల్లించే రూ.లక్ష నిలిపివేస్తున్నారు.600 చదరపు అడుగుల స్థలం మించి నిర్మాణం చేపట్టిన వారు పేదలు కాదని, వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తించదని చెల్లింపులను నిలిపివేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతుండగా, సొంత స్థలం ఉందనే నిర్మాణం చేపట్టాము తప్పితే, తాము ధనికులం కాదని వాపోతున్నారు.
ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్!
నిబంధనలు పాటించాల్సిందే...పొంగులేటి
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం ఉంటేనే బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇందిరమ్మ ఇండ్ల ను 400 చదరపు అడుగులకు తగ్గకుండా, 600 చదరపు అడుగులు మించకుండా నిర్మాణం జరిగితే బిల్లులు విడుదల చేయాలని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. నిర్మాణ దశలో ఉన్న లబ్ధిదారులకు ప్రతి సోమవారం బిల్లులను వారి ఖాతాలో జమ చేస్తామని తెలిపారు.
ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఇందిరమ్మ ఇండ్లు 600 చ.అడుగులలకు మించకుండా ఉంటేనే డబ్బులు విడుదల చేయాలని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. 200 దరఖాస్తులకు ఒక గెజిటెడ్ అధికారిని నియమించి, అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు అందేలా చూడాలని చెప్పారు. అనర్హులను ఎంపిక చేస్తే ఆ గెజిటెడ్ అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీతో ముగియనున్న ఎల్‌ఆర్‌ఎస్ గడువును మరోసారి పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!