/rtv/media/media_files/2025/06/29/konda-murali-vs-warangal-congress-mlas-2025-06-29-19-13-23.jpg)
konda murali vs warangal congress mlas
konda murali vs warangal congress mlas : వరంగల్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఘర్షణ తారాస్థాయికి చేరింది. జిల్లా ఎమ్మెల్యేలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా మురళిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎమ్మెల్యేలు అధిష్టానానికి డిమాండ్ చేస్తు్న్నారు. అయితే వారి కంప్లైంట్‌ను ఏమాత్రం పట్టించుకోని మురళి ముందుగా తానే క్రమశిక్షణ కమిటీతో సమావేశమయ్యారు. కమిటీ ఎదుట హాజరైన కొండా మురళి తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తారని.. ఆయనపై చర్యలు తప్పవని కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా చర్చ జరిగింది. అయితే అనూహ్యంగా ఆయన రివర్స్ కౌంటర్‌కు ఇచ్చారు. తనపై ఆరోపణలు చేస్తున్న వరంగల్ జిల్లా నేతలపైనే ఆయన కమిటీకి ఫిర్యాదు చేయడం గమనార్హం.
జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డిపై ఆయన క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేశారు. మొత్తం 15 పేజీలతో కొండా మురళి నివేదిక ఇచ్చారు. దీంతో జిల్లా ఎమ్మెల్యేలు షాక్ అయ్యారు. వెంటనే అత్యవసరం సమావేశం నిర్వహించారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు.జిల్లా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీలు, వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి స్వర్ణ, కుడా చైర్మన్‌తో సహా పలువురు భేటీ అయ్యారు.
ఇది కూడా చూడండి: Sexual Harassment : ఉద్యోగం ఆశ జూపి అత్యాచారం..పద్మ అవార్డు గ్రహీతపై ఆరోపణలు
Konda Family vs MLAs
కాగా, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన లేఖపైనే ఎమ్మెల్యేలు ప్రధానంగా చర్చించారు. జిల్లా ఎమ్మెల్యేలతో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. సీఎం సన్నిహితుడు వేం నరేందర్‌రెడ్డి గురించి కూడా కొండా ప్రస్తావించిన విషయాలపై వారు చర్చించారు. కొండా మురళి క్రమశిక్షణ కమిటీ భేటీకి వెళ్లడానికి ముందే ప్రచారంలోనికి వచ్చిన ఆ లేఖలో తొలుత మంత్రి పొంగులేటి గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. 2007లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన సమయంలో దళితులు, గిరిజనులకు ఎక్కువ సీట్లు వచ్చేలా తాను పనిచేశానని, అందుకే జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలు రిజర్వుడ్ కేటగిరీకి వెళ్లాయని మురళి తెలిపారు.
అయితే జిల్లాలో సీటు కోల్పోవడానికి తానే కారణమని ఆరోపిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత రామసహాయం సురేందర్‌రెడ్డి రాజకీయాలకు దూరమయ్యారని చెప్పారు. ఇప్పుడు ఆయన అల్లుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా ఉండటంతో అప్పటి కోపాన్ని తనపై , తన సతీమణి, మంత్రి కొండా సురేఖపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. డీలిమిటేషన్‌లో వేం నరేందర్‌రెడ్డి సీటు ఎగిరిపోయేందుకు కూడా తానే కారణమని నరేందర్‌రెడ్డి కోపం పెంచుకున్నారని లేఖలో పేర్కొన్నారు.
ఇక క్రమశిక్షణ కమిటీ తమను పిలిచే అవకాశం ఉండటంతో జిల్లా ఎమ్మెల్యేలు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి విషయంలో అనుసరించాల్సిన విషయమై చర్చంచారు. పార్టీకి తాము కావాలో మురళి కావాలో తేల్చుకోవాలంటూ వారు అల్టిమేటం ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే రాజీనామా అస్త్రం ప్రయోగించేందుకు కూడా వారు సిద్ధపడుతున్నారని తెలుస్తోంది. కాగా కమిటీ ముందు తాము అనుసరించాల్సిన వ్యూహం గురించి వారు సుదీర్ఘంగా చర్చించినట్లు ప్రచారం సాగుతోంది.
ఇది కూడా చూడండి: Shefali Jariwala: గుండె పోటు కాదు.. షఫాలీ పోస్ట్‌మార్టంలో బయటపడ్డ సంచలనాలు!
మరో వైపు కాంగ్రెస్ నేత కొండామురళిపై ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా మురళి పిచ్చిమాటలు మానుకోవాలని హెచ్చరించారు. క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చి కొండా తప్పుడు సమాచారం ఇచ్చారని అన్నారు. షో కాజ్ నోటీసులు ఇస్తే మళ్లీ వెళ్లి తనను ఎవరూ పిలవలేదని అంటున్నాడని చెప్పారు. కొండా కుటుంబానికి క్రమశిక్షణ సంఘంపై కూడా విశ్వాసం లేదని అన్నారు. పార్టీలు మారలేదని చెప్పుకుంటున్న కొండా కుటుంబం అన్ని పార్టీలు మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 38 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీని బతికించానని కొండా చెప్పారని, అసలు ఆయనకు రాజకీయ జన్మ ఇచ్చింది టీడీపీ పార్టీ అని అన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చరిత్ర కొండా మురళి కుటుంబానిది అని విమర్శించారు. కులాన్ని అడ్డం పెట్టుకుని కొండా మురళి రాజకీయ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. అన్ని పార్టీలను ఆయన తిడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీ వస్తే ఆ పార్టీలోకి కొండా మారుతాడన్నారు.
ఇది కూడా చూడండి: Ee Nagaraniki Emaindi: "ఈ నగరానికి ఏమైంది" ఫ్యాన్స్ కి పండగే.. సీక్వెల్ పోస్టర్ అదిరింది!
Also Read : రాత్రి నిద్రలో పదే పదే నీరు తాగుతారా..? ఇది వ్యాధని తెలుసుకోండి..!!
konda-sureka | Vem Narender Reddy | minister-ponguleti-srinivas-reddy | konda murali in gandhi bhavan | warangal-congress
Follow Us