Breaking : వారికి రూ.6 లక్షల పరిహారం.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. గత ఐదేళ్లలో పిడుగుపాటు, అగ్నిప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం అందిస్తామని వెల్లడించారు.  పిడుగుపాటు మృతుల కుటుంబాలకు రూ.6 లక్షలు, అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.లక్షల పరిహారం అందిస్తామన్నారు.

New Update
ponguleti minister

ponguleti minister

రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. గత ఐదేళ్లలో పిడుగుపాటు, అగ్నిప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం అందిస్తామని వెల్లడించారు.  పిడుగుపాటు మృతుల కుటుంబాలకు రూ.6 లక్షల పరిహారం, అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.లక్షల పరిహారం బాధిత కుటుంబాలకు సాయం చేయాలని విపత్తు నిర్వహణ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  

Also read :  తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐపీఎస్ అధికారి దుర్మరణం!

Also read :  చావుకు వెళ్తే చచ్చేంత పనైంది.. శవాన్ని నడిరోడ్డుపైనే వదిలేసి పరుగో పరుగు!

లబ్ధిదారులకు తొలి విడతగా రూ.లక్ష

ఇక రెండుపడక గదుల ఇళ్లపై  మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మార్చి 28వ తేదీ శుక్రవారం రోజున స‌చివాల‌యంలో మంత్రి సమీక్ష నిర్వహించారు.  ఇళ్లు లేని అర్హులైన వారికి ఇళ్లు కేటాయించాలని, అసంపూర్తిగా ఉన్న ఇళ్లను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. గతంలో మిగిలిపోయిన ఇళ్లను అర్హులకు కేటాయించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.  అలాగే బేస్‌మెంట్‌ వరకు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు తొలి విడతగా రూ.లక్ష చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు.  జూన్ చివరి నాటికి వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ ప‌నులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు.  అలాగే మ‌డికొండ డంపింగ్ యార్డుకు శాశ్వత ప‌రిష్కారం కోసం చర్యలు చేపట్టాలన్నారు.  

Also read :  Madhavi Latha: బెట్టింగ్ వలలో చిక్కడానికి మూలం అతడే.. నటి మాధవిలత సంచలన ఆరోపణ

Also read :  భర్త దుబాయ్లో సంపాదిస్తే..  భార్య ప్రియుడికి ఖర్చు పెట్టింది.. పాపం చివరకి

Advertisment
తాజా కథనాలు