అసెంబ్లీలో గందరగోళం..మంత్రి పొంగులేటి vs ఎమ్మెల్యే పల్లా!

ధరణి, భూ భారతిలపై బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వచ్చే ఎన్నికల్లో భూ భారతి కాన్సెప్ట్‌తో ప్రజల్లోకి వెళ్తామన్న మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. తాము ధరణిపైనే ఎన్నికలకు వెళ్తామని ఎమ్మెల్యే పల్లా అన్నారు.

New Update
MLA Palla Rajeshwar Reddy Vs Minister Ponguleti Srinivas Reddy

MLA Palla Rajeshwar Reddy Vs Minister Ponguleti Srinivas Reddy

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ధరణి, భూ భారతిలపై బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వచ్చే ఎన్నికల్లో భూ భారతి కాన్సెప్ట్‌తో ప్రజల్లోకి వెళ్తామన్న మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.  ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. అసత్యాన్ని సత్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.  బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే వారిని ఓడించారని అన్నారు మంత్రి.  అయితే భూభారతిపై కాంగ్రెస్‌ ఎన్నికలకు వెళ్తే.. తాము కూడా ధరణిపైనే ఎన్నికలకు వెళ్తామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. రెఫరెండం  ఏం వస్తుందో చూద్దాయమన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చింది భూ భారతి కాదు భూ హారతి అని విమర్శించారు. జమాబంది పేరుతో కాంగ్రెస్ మరో దుకాణం తెరిచిందని.. ఇప్పుడు జమాబంది ఎందుకో ప్రభుత్వం చెప్పాలని పల్లా డిమాండ్ చేశారు. .

Also read :  షాకింగ్ న్యూస్.. ప్రముఖ నటికి TB వ్యాధి! ఇన్ని రోజులు సీక్రెట్ గా...

 

ధరణి దుర్మార్గమైన చట్టం

పల్లా రాజేశ్వర్‌రెడ్డి సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారంటూ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు.  సాయుధ పోరాట స్ఫూర్తితోనే కాంగ్రెస్‌ భూములపై హక్కులు కల్పిస్తూ వస్తోందని తెలిపారు.  దున్నేవాడితే భూమి కదా సాయుధ పోరాట నినాదం అని గుర్తుచేశారు.  ఒక్క కలం పోటుతో భూమిపై హక్కులు లేకుండా చేసిన దుర్మార్గమైన చట్టమే ధరణి అని ఆరోపించారు.  ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని ఎన్నికల సమయంలో చెప్పామని..  చెప్పినట్లుగానే బంగాళాఖాతంలో వేశామని..  కొత్త చట్టం తెచ్చామని వెల్లడించారు.  

Also read :  Telangana: పాపం.. పరీక్ష సరిగ్గా రాయలేదని.. 10th విద్యార్థిని ఆత్మహత్య!

Also read :  థియేటర్లో మొత్తం మ్యాడ్, మ్యాడ్.. 'MAD Square' ట్రైలర్ చూశారా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు