వరంగల్ దశ తిరిగినట్టే.. విమానాశ్రయం.. ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్డు సహా! రేవంత్ సర్కార్ తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్‌ను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగు రోడ్డు, విమానాశ్రయం నిర్మాణం వంటి విషయాలపై రాష్ట్ర మంత్రులు తాజా సమావేశంలో చర్చించారు. By Seetha Ram 06 Nov 2024 in తెలంగాణ వరంగల్ New Update షేర్ చేయండి ఇప్పటి వరకు తెలంగాణకు ఒక్కటే రాజధాని.. అదీ హైదరాబాద్. దీంతో అభివృద్ధి మొత్తం హైదరాబాద్‌తో పాటు నగర పరిసర ప్రాంతాల్లోనే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సరిపడా వనరులు ఉన్నాయి. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగురోడ్డు, నగర శివారు ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు బాగా మెరుగుపడటమే దీనికి ముఖ్య కారణం. అయితే ఇప్పుడు ఒక్క హైదరాబాద్ మాత్రమే కాకుండా ఇలాంటి అభివృద్ధే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. Also Read : ఫ్రిజ్‌లో ఈ సీక్రెట్ బటన్ ఇలా వాడితే... తాజా ఆహారం మీ సొంతం రెండో రాజధానిగా వరంగల్ ఇందులో భాగంగానే రాష్ట్రానికి రెండో రాజధానిగా వరంగల్‌ను డెవలప్ చేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రేవంత్ రెడ్డి సర్కార్ వరంగల్ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మంత్రి పొంగులేటి ఇటీవల వరంగల్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మరింత బలం చేకూరుస్తున్నాయి. Also Read : వాహనదారులకు షాక్.. హెల్మెట్ లేకపోతే ఫైన్ ఎంతంటే! ఈ తరుణంలోనే నవంబర్ 5న హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలు జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం అయ్యారు. వరంగల్, హనుమకొండ జిల్లాల అభివృద్ధిపై మంగళవారం చర్చించారు. వరంగల్ ఔటర్ రింగు రోడ్డు, ఇన్నర్ రింగు రోడ్డులకు సంబంధించి తదితర విషయాలపై చర్చించారు. Also Read : ప్రముఖ నటి అరెస్టుకు రంగం సిద్ధం..! ఈ సమావేశంలో భాగంగా వరంగల్ చుట్టూ 41 కి.మీ ఔటర్ రింగు రోడ్డును మూడు దశల్లో నిర్మించనున్నట్లు సమాచారం. ఇక రింగు రోడ్డు అంశంతో పాటు విమానాశ్రయం అంశంపై కూడా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే మామునూరు విమానాశ్రయం పనులను త్వరలో ప్రారంభించి.. ఏడాదిలోపు ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. Aslo Read : ఓ మై ఫ్రెండ్...అంటూ ట్రంప్ కి శుభాకాంక్షలు తెలిపిన మోదీ! దీనిపై మంత్రి కొండా సురేఖ సైతం మాట్లాడారు. దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న మామునూరు ఎయిర్‌పోర్ట్ కల మరికొద్ది రోజుల్లో సాకారం కానుందని తెలిపారు. ఈ మేరకు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ వరంగల్ మిమానాశ్రయం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. దీంతో వరంగల్ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్లుగా వరంగల్‌ను రెండవ రాజధానిగా ప్రకటించి అభివృద్ధి పనులు మొదలెట్టి, ఔటర్ రింగురోడ్డు, విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొస్తే.. వరంగల్ దశ తిరిగినట్టేనని పలువురు చర్చించుకుంటున్నారు. #warangal #minister-ponguleti-srinivas-reddy #cm-revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి