TG News: పేరు అడిగితే.. కలెక్టర్ కి షాకిచ్చిన బుడ్డోడు! ఏం చేశాడో చూడండి
సూర్య పేట కలెక్టర్ తేజస్ నందలాల్ నూతనకల్ మండలం గుండ్లసింగారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఆకస్మిక తనిఖీకి వెళ్లగా.. అక్కడ ఓ బుడ్డోడు తన మాటలతో కలెక్టర్ షాకయ్యేలా చేశాడు.
సూర్య పేట కలెక్టర్ తేజస్ నందలాల్ నూతనకల్ మండలం గుండ్లసింగారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఆకస్మిక తనిఖీకి వెళ్లగా.. అక్కడ ఓ బుడ్డోడు తన మాటలతో కలెక్టర్ షాకయ్యేలా చేశాడు.
పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’కు అల్లు అర్జున్ షాకిచ్చారు. HYDలోని అమీర్‌పేటలో ఉన్న ‘AAA’ థియేటర్లో ఈ మూవీ షోస్ ప్రదర్శించబోనట్లు తెలుస్తోంది. బుక్‌మైషోలో ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ‘AAA’లో కనిపించకపోవడంతో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆర్థిక కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్‌లో అరెస్టు చేసిన నలుగురు నిందితులతో సహా అధ్యక్షుడు జగన్మోహన్ రావును సీఐడీ అధికారులు కస్టడీకి కోరారు. ఈ మేరకు మల్కాజ్గిరి కోర్టు 6 రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది.
తమ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచే నాటికి లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ ప్రకటించారు. తుంగతుర్తిలో ఈ రోజు జరుగుతున్న రేషన్ కార్డుల పంపిణీ సభలో ఆయన మాట్లాడారు.
తెలంగాణలో గుండెపోటుతో విద్యార్ధి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. కరుణాపురం గ్రామంలో జ్యోతిబాఫూలే బాలుర గురుకులంలో ఇంటర్ చదువుతున్న మణిదీప్(17) గుండెపోటుతో మృతి చెందాడు. ఇతని మృతిపై కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
నేడు గురు పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో ఉన్న అన్ని సాయిబాబా ఆలయాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలి వెళ్తున్నారు.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మరోసారి యశోద ఆసుపత్రికి నేడు వెళ్లనున్నారు. పరీక్షల కోసం వెళ్లనున్నట్లు సమాచారం. గతవారమే తీవ్ర జ్వరంతో కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం కాస్త మెరుగు కావడంతో పరీక్షల కోసం మళ్లీ ఆసుపత్రికి వెళ్లనున్నారు.
డమ్మీ కాదని నిరూపించుకునేందుకు ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజ్ పై లీగల్ టీమ్ ను ఏర్పాటు చేయాలని రాంచందర్ రావుకు ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. ఫాతిమా కాలేజీ కూల్చేందుకు కొట్లాడాలన్నారు. ఈ మేరకు రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేయడం బీజేపీలో సంచలనంగా మారింది.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. రాజ్‌భవన్, పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టు, జింఖానా క్లబ్, సికింద్రాబాద్ సివిల్ కోర్టుల్లో బాంబ్ పెట్టినట్లు ఓ గుర్తుతెలియని వ్యక్తి ఈమెయిల్ పంపించాడు.