Imadi Ravi: సాఫ్ట్‌వేర్‌ జాబు వదిలి.. పైరసీ కింగ్ పిన్‌గా ఇమ్మడి రవి.. సంచలన విషయాలు

ఐ బొమ్మ తో  సినిమా నిర్మాతలకు బొమ్మ చూపించడమే కాకుండా కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. రవి విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకప్పుడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసిన రవి పైరసీ కింగ్ పిన్‌గా మారాడు.

New Update
FotoJet - 2025-11-15T212245.752

Ibomma Case: ఐ బొమ్మ(ibomma news) తో  సినిమా నిర్మాతలకు బొమ్మ చూపించడమే కాకుండా కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన ఇమ్మడి రవి(Imadi Ravi) ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కాగా ఇమ్మడి రవి కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దూకుడు పెంచారు. రవిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకప్పుడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసిన రవి తక్కువ సమయంలో డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పైరసీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. దీంతో పైరసీ కింగ్ పిన్‌గా ఇమ్మడి రవి మారారు. ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ చదివాడు ఇమ్మడి రవి. కాగా బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఐబొమ్మ మధ్య భారీగా లావాదేవీలు జరిగినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.

Also Read :  ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

IBomma Imadi Ravi Becomes Piracy Kingpin

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతో భారీగా డబ్బులు తీసుకున్నాడు రవి. బెట్టింగ్ కేసు దర్యాప్తు జరుపుతుండగా ఐ బొమ్మ లింక్ దొరికిందని వివరించారు. నేదర్ల్యాండ్స్, కరేబియన్ దీవులకు వెళ్లే ముందు రవి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీ నెలకొల్పినట్లు తెలుస్తోంది. వెబ్‌డిజైన్ సర్వీస్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పి.. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ కంపెనీని ఆయన స్థాపించారు.ER infotech అనే సాఫ్ట్‌వేర్ కంపెనీకు సీఈవోగా కూడా రవి ఉండడం గమనార్హం. నిన్న(శనివారం) రవిని ట్రేస్ చేసి కూకట్‌పల్లి రెయిన్ బో విస్టాలో సీసీఎస్ పోలీసులు  అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది న్యాయస్థానం. రేపు(సోమవారం) సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్నారు. ఇమ్మడి రవిని వారం రోజుల పాటు తమ కస్టడికి సీసీఎస్ పోలీసులు కోరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా దమ్ముంటే నన్ను పట్టుకోండి అని ఛాలెంజ్ చేసిన ఇమ్మడిరవిని ఎట్టకేలకు అరెస్ట్ చేసిన హైదరాబాద్ సిటీ పోలీస్, డీసీపీ కవిత, సైబర్ క్రైమ్ పోలీసుల్ని రాష్ట్ర హోంశాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్ అభినందించారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సీపీ సజ్జనార్, సైబర్ క్రైమ్ డీసీపీ కవితకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ లో ట్వీట్ చేశారు.  ఈ సందర్భంగా హ్యాకర్లు డిజిటల్ కంపెనీల సర్వర్లను హ్యాక్ చేసి, ఒరిజినల్ సినిమా కాపీలను తమ వెబ్ సైట్లలో రిలీజ్ చేస్తున్నారని,  తద్వారా హై లెవల్ HD సినిమా పైరసీ ప్రొసీడింగ్స్ ను తిరిగి పోస్ట్ చేస్తున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు. దీనివల్ల సినీ ఇండస్ట్రీకి భారీ నష్టం వాటిల్లిందన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్ట్ చేసేందుకు సైబర్ క్రైమ్ రేయింబవళ్లు కష్టపడిందని గుర్తు చేశారు.  

Also Read :  సూర్యాపేటలో పోలీసులపైకి దూసుకెళ్లిన కారు.. కానిస్టేబుల్ స్పాట్ డెడ్!

Advertisment
తాజా కథనాలు