TG Crime: సూర్యాపేటలో పోలీసులపైకి దూసుకెళ్లిన కారు.. కానిస్టేబుల్ స్పాట్ డెడ్!

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం నాగారంలో సూర్యాపేట-జనగామ హైవేపై పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ కమలాకర్‌ను అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. కానిస్టేబుల్ మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.

New Update
TG Crime

TG Crime

సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(road accident)లో విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీసు కానిస్టేబుల్ మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఈ ప్రమాదానికి కారణమైంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం నాగారం శివారులో సూర్యాపేట-జనగామ హైవేపై పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ కమలాకర్‌ను జనగామ నుంచి సూర్యాపేట వైపు అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. 

పోలీసు కానిస్టేబుల్‌ మృతి..

ప్రమాదం జరిగిన వెంటనే కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ కమలాకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతని రెండు కాళ్లు విరిగిపోయాయి. మొదట అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందింది. తరువాత అదే కారు అటుగా వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు కూడా గాయపడ్డారు. సిఐ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం... పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. వేగంగా వచ్చిన కారు ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి అదుపుతప్పి ఈ ముగ్గురిని ఢీకొట్టింది. 

ఇది కూడా చదవండి: మరో ఘోర బస్సు ప్రమాదం.! స్పాట్‌లో 8 మంది..

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ కమలాకర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు, కానీ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారని తెలిపారు. గాయపడిన మరో ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ మృతికి కారణమైన కారు డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అతివేగం, అజాగ్రత్తే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. కారును గుర్తించి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

ఇది కూడా చదవండి: లారీని ఢీకొన్న ఆర్టీసీ బ‌స్సు.. స్పాట్‌లో 12 మంది

Advertisment
తాజా కథనాలు