/rtv/media/media_files/2025/11/16/fotojet-2025-11-16t081023145-2025-11-16-08-10-42.jpg)
Telangana Indiramma Sarees
Telangana Indiramma Sarees : గత కొంతకాలంగా ఊరిస్తూ వస్తున్న ఉచిత చీరల పంపిణీకి ముహూర్తం ఫిక్సయింది.స్వయం సహాయ సంఘాల సభ్యురాళ్లకు ఉచిత చీరల పంపిణీ(indriamma sarees)కి రంగం సిద్ధమయింది. రాష్ట్రంలో 64 వేల మంది సభ్యులుండగా ఇప్పటివరకు 50 చీరలు సిద్ధం చేశారు. వాటిని శనివారం నాటికి జిల్లాలకు పంపించారు. మిగిలినవి వారం రోజుల్లో పంపించేందుకు చేనేత, జౌళి శాఖ ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 19న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మహిళలకు రెండు చీరలను ఉచితంగా పంపిణీ చేయనుంది. దానికి అనుగుణంగా పంపిణీ కోసం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలోని ఎస్‌హెచ్‌జీ మహిళలకు ఉచిత చీరలు ఇస్తామని గత ఏడాది సెప్టెంబరు 9న సీఎం రేవంత్‌రెడ్డి(cm-revanthreddy) ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి అనుగుణంగా రూ.318 కోట్లను విడుదల చేయడంతో మార్చి నుంచి చేనేత, జౌళి శాఖ చీరల తయారీని చేపట్టింది. దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి అయిన ఈ నెల 19న చీరలను పంపిణీ చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. కాగా, ఇది మహిళల సంక్షేమాన్ని పెంపొందించడంతో పాటు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం ద్వారా చేనేత రంగాన్ని ప్రోత్సహించడానికి చేస్తున్న కార్యక్రమమని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షలకు పైగా మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులకు చీరలు పంపిణీ చేయనున్నారు.
Also Read: ఇంజక్షన్ వికటించి.. 17 మంది చిన్నారులకు అస్వస్థత..స్పాట్‌లో..
బతుకమ్మ స్థానంలో ఇందిరమ్మ
కాగా ఉచిత చీరల విధానాన్ని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బతుకమ్మ పండుగ సందర్భంగా దీన్ని అమలు చేసింది.అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బతుకమ్మ చీరలు పథకానికి బదులుగా ఇందిరమ్మ చీరలు పథకాన్ని(indiramma sarees to telanagana ladies) ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతి మహిళకి రెండు చీరలు ఉచితంగా అందజేస్తారు. గత ఏడాది ఆగస్టు 7న జరిగిన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఒక్కో చీరకు ప్రభుత్వం రూ.480 కేటాయించింది. ఇది గతంలో బతుకమ్మ చీరల పథకానికి ఖర్చు చేసిన రూ.350 కంటే ఎక్కువ కావడం గమనార్హం.
ఈ చీరల పంపిణీని మొదట అక్టోబర్‌లో బతుకమ్మ, దసరా పండుగల సందర్భంలో పంపిణీ చేయాలని ప్రభుత్వం అనుకుంది. అయితే ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌లు జారీ చేయడం, ఆ వెంటనే హైకోర్టు రిజర్వేషన్లను నిలిపివేయడంతో ఎన్నికలు రద్దవడం వంటి కారణాలతో చీరల పంపిణీ వాయిదా పడింది. ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నోటిఫికేషన్ రావడంతో మరోసారి వాయిదా పడింది. ఈ అడ్డంకులన్నీ తొలగిపోవడంతో ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా చీరలు పంపిణీని చేపట్టాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.
లబ్ధిదారులు ఎవరంటే?
అయితే గత ప్రభుత్వం మహిళలందరికీ చీరలు పంపిణీ చేయగా ఇందిరమ్మ చీరల పథకం కింద కేవలం స్వయం సహాయ సంఘాల సభ్యురాళ్లకు మాత్రమే అందజేస్తారు. వీటిని గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ద్వారా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో చీరలు పంపిణీ జరుగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 4.35 లక్షల SHG బృందాలు, పట్టణ ప్రాంతాల్లో దాదాపు 1.70 లక్షల SHG బృందాలు ఉన్నట్లు తేల్చారు. మొత్తంగా రాష్ట్రంలో 64.69 లక్షల మంది మహిళా లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. పంపిణీ సజావుగా జరిగేందుకు అవసరమైన స్టాక్‌ను ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాల్లోని గోడౌన్స్‌కు తరలించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
Also Read : సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లా?...అవినీతి కేంద్రాలా? ఏసీబీ దాడులు, భారీగా నగదు పట్టివేత
చేనేతకు వర్గాలకు చేయూత
కాగా ఈ చీరలను రాజన్న-సిరిసిల్ల, కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లోని చేనేత కార్మిక సంఘాలు, ఇందిర మహిళా శక్తి చొరవ కింద ఉత్పత్తి చేస్తున్నాయి. సిరిసిల్లలో మాత్రమే దాదాపు 131 నేత యూనిట్లు ఉత్పత్తి ఆర్డర్‌లను పొందడం గమనార్హం. మొత్తంగా, ఈ ఆర్డర్ కోసం 4.24 కోట్ల మీటర్ల ఫాబ్రిక్ అవసరమవుతుంది. ఈ ఉత్పత్తి ప్రక్రియలో దాదాపు 6,900 మంది నేత కార్మికులు పాల్గొంటున్నారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించడమే కాకుండా రాష్ట్ర ఓటర్లలో దాదాపు సగం మంది ఉన్న మహిళలతో దాని అనుబంధాన్ని బలోపేతం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
Follow Us