/rtv/media/media_files/2025/11/18/sridhar-babu-2025-11-18-19-04-07.jpg)
తెలంగాణలో వాట్సప్ మీ సేవ(watsapp meeseva) సర్వీసులను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు(it-minister-sridhar-babu) ప్రారంభించారు. ఇందులో 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కిపైగా సర్వీసులను వాట్సప్ ద్వారా పొందేలా మీసేవ ఏర్పాట్లు చేసింది. ఈ సౌకర్యాన్ని మెటా, మీ సేవ సంయుక్త భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే.. ఇంటి నుంచే సేవలను పొందే అవకాశం ఉంటుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకంతో ప్రజలు మీ-సేవ కేంద్రాలకు(Meeseva Centers) పదే పదే వెళ్లాల్సిన అవసరం లేకుండానే అనేక సేవలను ఇంటి నుంచే పొందవచ్చు. ప్రారంభంలో 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కి పైగా మీ సేవ సర్వీసులను వాట్సాప్ ద్వారా పొందేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సర్వీసులో క్యాస్ట్, ఇన్‌కం సర్వీస్ సర్టిఫికేట్లు, రెసిడెన్సీ సర్టిఫికేట్, మరణ, జనన దృవీకరణ పత్రాలు కూడా వాట్సప్ నుంచే పొందవచ్చు. అంతేకాదు కరెంటు, వాటర్ బిల్లులు చెల్లించవచ్చు.
Also Read : iBomma కేసులో ED ఎంట్రీ.. రవి ఖాతాలో వేల కోట్ల డబ్బు?
WhatsApp Meeseva In Telangana
ఈ సేవలను ఉపయోగించుకునేందుకు ఫోన్‌లో 8096958096కు మీసేవా వాట్సాప్ నంబర్‌ను సేవ్ చేసుకోవాలి. ఈ నంబర్‌కు "Hi" లేదా "మెనూ" అని టైప్ చేసి పంపాలి. అందుబాటులో ఉన్న ప్రభుత్వ సేవల జాబితా వస్తుంది. ఆ తర్వాత కావాల్సిన సేవను ఎంచుకోవాలి. ఆధార్ ఆధారిత ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసి, అవసరమైన దరఖాస్తు ఫారమ్‌ను వాట్సాప్ ఇంటర్‌ఫేస్ ద్వారా పూరించవచ్చు. అయితే మీ-సేవ సెంటర్‌లో దరఖాస్తు చేసుకున్న దానికి సంబంధించిన అన్ని అప్‌డేట్‌లను వాట్సాప్‌లోనే చెక్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత, ఆ సర్టిఫికెట్‌ను సైతం వాట్సాప్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ సదుపాయం ద్వారా ప్రజలు ఇంటి నుంచే సులభంగా, వేగంగా ప్రభుత్వ సేవలను పొందవచ్చు.
Also Read : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Follow Us