/rtv/media/media_files/2025/11/19/cm-revanth-reddy-launched-indiramma-sarees-distribution-2025-11-19-14-31-14.jpg)
CM Revanth Reddy Launched Indiramma Sarees Distribution
తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీని సీఎం రేవంత్(cm revanth) ప్రారంభించారు. అంతకుముందు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్‌రోడ్‌లో ఆమె విగ్రహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత పలువురు మహిళలకు ఆయన చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సహా మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. '' ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపణీని ప్రారంభించుకున్నాం.
Also Read: ఐసిస్ తో సంబంధాలు..ఛత్తీస్ ఘడ్ లో ఇద్దరు మైనర్ కుర్రాళ్ళు అరెస్ట్
Revanth Reddy Launched Indiramma Sarees Distribution
ఆడబిడ్డలకు సారె, చీర పెట్టడం అనేది తెలంగాణ సంప్రదాయం. అందుకే ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతీ నియోజకవర్గానికి ఓ ప్రత్యేక అధికారిని నియమించాలి. నియోజకవర్గాల్లోని అన్ని మండల కేంద్రాల్లో విడతల వారీగా ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ చీరలను పంపిణీ చేయాలి. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడమే కాదు వాటికి మహిళలను యజమానులను చేశాం. స్కూల్స్‌లో యూనిఫాం కుట్టే కుట్టుపని బాధ్యతను మహిళా సంఘాలకే అప్పగించాం. ఇందిరమ్మ క్యాంటీన్లు, శిల్పారామంలో 3 ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి బజార్‌ను ఏర్పాటు చేశాం.
Also Read: సాయుధ పోరాటంలో అసువులు బాసిన కుటుంబం.. ఒంటరైన హిడ్మా తల్లి
ఆన్‌లైన్ మార్కెట్ కోసం అమెజాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.కోటి మంది మహిళలలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు నుంచి డిసెంబర్ 9 వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ ఉంటుంది. మార్చి 1 నుంచి 8 వరకు పట్టణ ప్రాంతాల్లో ఈ చీరల పంపిణీ ఉంటుంది. మొత్తం కోటి మంది మహిళలకు కోటి చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని'' సీఎం రేవంత్ అన్నారు.
Follow Us