Kavitha Arrest: కల్వకుంట్ల కవిత అరెస్ట్!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ని ముట్టడించడానికి తెలంగాణ జాగృతి నేతలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు కవితతోపాటు పలువురు జాగృతినేతల్ని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

New Update
kavitha arrest

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు(Telangana Jagruthi Leader) కవితని పోలీసులు అరెస్ట్(Kavitha Arrest) చేశారు. ఆమె జాగృతి నేతలతో కలిసి హైదరాబాద్‌ లక్డీకపూల్‌లోని సింగరేణి భవన్‌ని ముట్టడించడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు కవితతోపాటు పలువురు జాగృతి నేతల్ని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

Also Read :  BREAKING: ఐబొమ్మ రవికి మరో బిగ్ షాక్..

Kavitha Arrest

Also Read :  ఢిల్లీ ఆత్మాహుతి దాడిపై.. MP అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలని, మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ సింగరేణి భవన్ ముట్టడికి పిలుపునిచారు కవిత. ఈ క్రమంలో సింగరేణి భవన్ ముట్టడిలో పాల్గొన్న కవిత రోడ్డుపై బైఠాయించారు . సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో  కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

Advertisment
తాజా కథనాలు