Fevikwik Horror: వీడియో: చిల్లరగాళ్లు.. పడుకున్న 8 మంది విద్యార్థుల కళ్లలో ఫెవిక్విక్ పోసేశారు..

ఒడిశా కంధమాల్ జిల్లాలోని ఓ ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. నిద్రిస్తున్న ఎనిమిది మంది విద్యార్థుల కళ్లలో తోటి విద్యార్థులు ఫెవిక్విక్ వేశారు. కళ్లు తెరవలేక బాధపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం వారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

New Update
Odisha Kandhamal 8 Hostel Students Hospitalised After Fevikwik Put in Eyes

Odisha Kandhamal 8 Hostel Students Hospitalised After Fevikwik Put in Eyes

ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై తోటి విద్యార్థులు దారుణానికి తెగబడ్డారు. నిద్రిస్తు్న్న ఎనిమిది మంది కళ్లలో ఫెవిక్విక్ పోశారు. దీంతో ఆ ఎనిమిది మంది విలవిల్లాడిపోయారు. వెంటనే వారిని సమీపంలో ఉన్న హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Fevikwik Put in Eyes

కంధమాల్ జిల్లా ఫిరింగియా బ్లాక్‌లోని సలాగూడ సెబాశ్రమ్ స్కూల్‌లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. పాఠశాల వసతి గృహంలో ఉన్న విద్యార్థులు రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకున్నారు. అర్థరాత్రి సమయంలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు నిద్రిస్తున్న ఎనిమిది మంది విద్యార్థుల కళ్లలో తోటి విద్యార్థులు ఫెవిక్విక్ పోశారు. ఆ సమయంలో వారికి మెలుకువ కూడా రాకపోవడంతో అలా ఉండిపోయారు. 

ఇక ఉదయం లేచే సరికి ఆ 8 మంది స్టూడెంట్స్ తమ కళ్లను తెరవలేకపోయారు. భయ బ్రాంతులకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక గజగజ వణికిపోయారు. ఒకానొక సమయంలో గుడ్డివాళ్లం అయిపోయామా? అనే సందేహంతో భయపడిపోయారు. దీంతో ఒక్కసారిగా అరుపులు, కేకలు వేశారు. తీవ్రమైన మంట, నొప్పి, కళ్లు తెరవలేకపోవడంతో బాధపడ్డారు. వెంటనే ఉపాధ్యాయులు వారిని గుర్తించి స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అక్కడ నుంచి ఫుల్బానిలోని జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆ 8 మందిని పరీక్షించిన డాక్టర్లు చికిత్స అందించారు. ప్రస్తుతం ఒక విద్యార్థిని డిశ్చార్జ్ చేశారు. మరో ఏడుగురుని అబ్జర్వేషన్‌లో ఉంచారు. 

వైద్యులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. విద్యార్థుల కళ్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. కానీ దృష్టికి ఎలాంటి ప్రమాదం లేదు. సరైన సమయంలో చికిత్స అందడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణానికి పాల్పడిన విద్యార్థులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సంఘటన విద్యార్థుల మధ్య భద్రత, పాఠశాలల్లో పర్యవేక్షణ ఎంత అవసరమో మరోసారి గుర్తు చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాఠశాల యాజమాన్యాలు మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని పలువురు చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు