Chhath Festivals: మృత్యువు విధ్వంసం.. 11 మంది జలసమాధి

బీహార్‌లో ఘోరం జరిగింది. ఛఠ్ పూజ సందర్భంగా జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తొమ్మిది మంది చిన్నారులు ఉన్నారు. నది ఘాట్‌ల వద్ద తొక్కిసలాట, నీటిలో మునిగిపోవడం వంటి ఘటనల్లో ఈ విషాదం చోటుచేసుకుంది.

New Update
Chhath Puja Tragedy in Bihar 11 people including 9 children killed

Chhath Puja Tragedy in Bihar 11 people including 9 children killed


బీహార్‌లో ఘోరం జరిగింది. అక్కడ అత్యంత పవిత్రంగా భావించే ఛఠ్ పూజ ప్రారంభంలోనే పెను విషాదం చోటుచేసుకుంది. పండుగలో భాగంగా జరిగే 'నహయ్ ఖాయ్' ఆచారాల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాల్లో దాదాపు 11 మంది మరణించారు. మృతులలో పిల్లలు, యువకులే ఎక్కువగా ఉండటం గమనార్హం. వీరిలో పాట్నాలోని గంగా నదిలో స్నానం చేస్తుండగా ముగ్గురు యువకులు మునిగిపోయారు. అలాగే వైశాలిలో మరొకరు మరణించారు. 

ఇంకా జముయిలో ఇద్దరు యువకులు మునిగిపోయారు. బెగుసరాయ్‌లో కూడా ఒక యువకుడు మరణించాడు. సీతామర్హిలో ముగ్గురు వ్యక్తులు మునిగిపోయారు. కైమూర్‌లో 10 ఏళ్ల బాలుడు మునిగిపోయి మరణించాడు. ఇలా దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

పట్నాలో ముగ్గురు యువకులు డెడ్

పట్నా జిల్లాలోని ఫతుహా ప్రాంతంలో ఘోరం జరిగింది. నహయ్ ఖయ్ రోజున గంగా నదిలో స్నానం చేస్తుండగా.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు నీటి ప్రవాహానికి గల్లంతై మరణించారు. వారిలో ఇద్దరు సోదరులు, ఒకరు మేనల్లుడు ఉన్నారు. వీరిని 15 ఏళ్ల వయసున్న గుడ్డు కుమార్‌, 18 ఏళ్ల వయసున్న సోనూ కుమార్, 19 ఏళ్ల వయసున్న సౌరవ్ కుమార్ గా గుర్తించారు. ఒకరు జారిపడి మునిగిపోగా.. అతన్ని రక్షించే ప్రయత్నంలో మరో ఇద్దరు మునిగిపోయారు.

బాంకా, వైశాలీ జిల్లాల్లో విషాదం

పండుగ సన్నాహాల్లో భాగంగా నదిలో స్నానం చేస్తుండగా.. బంకా, జముయ్, బేగుసరాయ్, వైశాలీ, సీతామర్హితో సహా పలు జిల్లాల్లో ఈ దారుణ సంఘటనలు నమోదయ్యాయి. బంకా జిల్లాలోని అమర్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నలుగురు పిల్లలు నదిలో మునిగిపోయారు. వారిలో ఒకరిని కాపాడారు. వైశాలీ జిల్లాలోని దేశరీ పోలీస్ స్టేషన్ పరిధిలో గంగా నదిలో స్నానానికి దిగిన ఓ బాలుడు గల్లంతై మరణించాడు.

వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ (SDRF) బృందాలు సంఘటనా స్థలాలకు చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇలా తీవ్ర ప్రయత్నాలు చేసిన తర్వాత డెడ్ బాడీలను కనుగొన్నారు. ఈ మరణాలతో ఛఠ్ పూజా కార్యక్రమాల వేళ.. గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

Advertisment
తాజా కథనాలు