/rtv/media/media_files/2025/11/14/vijayawada-crime-news-2025-11-14-06-58-42.jpg)
విజయవాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలు నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే భర్త తన భార్య గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఆ దారుణ ఘటనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిని కూడా బెదిరించాడు. దీంతో అక్కడ ఉండే ప్రజలు భయపడి ఆమెను కాపాడలేకపోయారు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలో దుర్గా అగ్రహారానికి చెందిన దీపాల విజయ్ (40), నూజివీడుకు చెందిన మట్టకొయ్య సరస్వతి (30) ప్రేమించి 2022లో పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. అయితే విజయ్ భవానీపురంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో టెక్నీషియన్‌గా వర్క్ చేస్తున్నాడు.
ఇది కూడా చూడండి: Kurnool Bus Accident: షాకింగ్ విజువల్స్.. కర్నూలు బస్సు ప్రమాదం - వెలుగులోకి సంచలన వీడియో
అనుమానంతోనే భార్యను..
సరస్వతి సూర్యారావుపేటలోని ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో ఏడాదిన్నరగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. సరస్వతి నూజివీడులో ఉంటూ రోజూ ఆసుపత్రికి వచ్చి వెళ్తున్నారు. అయితే ఇలాగే విధుల్లో ఉన్నప్పుడు భర్త మధ్యాహ్నం ఆమెపై దాడి చేశాడు. కత్తి, గొంతుపై ఇష్టం వచ్చినట్లు పొడిచాడు. దీంతో ఆమె తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందింది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. అయితే పెళ్లి జరిగిన తర్వాత భార్యపై అనుమానం రావడం వల్ల ఇలా హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Divorce News: భార్యాభర్తల మధ్య లొల్లి పెట్టిన కుక్క.. కోర్టు మెట్లెక్కిన భర్త!
Follow Us