ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం వల్ల ప్రస్తుతం కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల చేవెళ్లలో ఘోర బస్సు ప్రమాదం జరగ్గా 24 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఉలవపాడు బైపాస్ దగ్గర కూడా ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉలవపాడు బైపాస్ దగ్గర ఆటోను కారు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న 13 మంది మహిళలకు, కారులో ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి.
ఇది కూడా చూడండి: Hyderabad Drug Bust: హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు..ఓవర్ డోస్ తో యువకుడు...
కొందరి మహిళల పరిస్థితి విషమం..
కొందరు మహిళలు రోడ్డుపైనే తీవ్ర గాయాలతో స్పృహ తప్పి పడిపోయారు. వీరిలో ప్రస్తుతం నలుగురు మహిళల పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే వీరిని ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసమైంది. నెల్లూరు జిల్లాలో లోకేష్ పర్యటన కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు బాధితులను పరామర్శించారు.
ఇది కూడా చూడండి: land dispute: కాల్చి పారేస్తా నా కొడకా...భూ వివాదం.. తుపాకీతో బెదిరింపు
Follow Us