/rtv/media/media_files/2025/09/17/love-swaps-shake-up-two-families-bareilly-uttar-pradesh-2025-09-17-14-56-51.jpg)
love swaps shake up two families bareilly uttar pradesh
ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. బరేలీ జిల్లా దేవ్రానియన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని కమలుపూర్ గ్రామంలో సినిమాను తలపించే ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఓ వ్యక్తి తన భార్య చెల్లెలితో పరారవ్వగా.. అతడి సోదరితో బామర్ది జంప్ అయిన ఘటన గ్రామస్థులను, పోలీసులను షాక్‌కు గురి చేసింది. ఈ సంఘటన ఆగస్టు 23న జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
uttar pradesh love swaps
28 ఏళ్ల కేశవ్ కుమార్‌కు 6 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అతడు తన భార్య చెల్లెలు అయిన 19 ఏళ్ల కల్పనతో కలిసి ఇంటి నుండి పారిపోయాడు. దీంతో కేశవ్ కుమార్ కోసం అతడి కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఇదే విషయం ఊరు ఊరంతా తెలియడంతో అంతా షాక్ అయ్యారు. అయితే ఈ కథ ఇక్కడితో ముగియలేదు.
UP Man Elopes With Sister-In-Law, Brother-In-Law Runs Away With His Sister Next Day https://t.co/vPX0rrRacOpic.twitter.com/QORp4zsLPz
— NDTV (@ndtv) September 16, 2025
ఆ మరుసటి రోజే మరో ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. కేశవ్ బావమరిది రవీంద్ర ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో రవీంద్ర తన బావ కేశవ్ కుమార్ 19ఏళ్ల సోదరిని తీసుకుని పరారయ్యాడు. ఈ సంఘటన మొత్తం ప్రాంతంలో చర్చనీయాంశమైంది. ఈ సోదరీమణుల మార్పిడిని చూసి ప్రజలు షాక్ అయ్యారు. మొత్తం తెలిసిన ఏరియాల్లో వారిని వెతికారు. కానీ ఎక్కడా వారి జాడ కనిపించలేదు.
ఈ ఘటన నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని రెండు రోజుల పాటు గాలించారు. చివరికి సెప్టెంబర్ 14, 15 తేదీల్లో పోలీసులు ఆ జంటలను పట్టుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి రెండు కుటుంబాలను పిలిచారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. చివరికి రెండు కుటుంబాలు పరస్పర అంగీకారంతో ఈ విషయాన్ని పరిష్కరించుకున్నాయి. కేశవ కుమార్ కల్పనను, రవీందర్.. కేశవ సోదరిని విడిచిపెట్టేందుకు అంగీకరించారు. దీంతో అంతా హమ్మయ్య అనుకున్నారు. కానీ ఈ వివాదం పోలీస్ స్టేషన్‌లో ముగిసినప్పటికీ, ఈ సంఘటన గ్రామంలో అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది.