అరెస్ట్ కాబోతున్నా.. పార్టీ నేతల వద్ద కేటీఆర్ ఎమోషనల్!
తనను అరెస్టు చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ అన్నారు. దీనిపై పోరాటం చేయడానికి పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. లగచర్ల కలెక్టర్ పై దాడి కేసులో కేటీఆర్ ఏ క్షణమైనా అరెస్ట్ కావొచ్చన్న ప్రచారం సాగుతోంది.