MLA KTR: బీఆర్ఎస్ అధికారం మాత్రమే కోల్పోయిందని, పోరాడే తత్వాన్ని కాదని అన్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్. నేడు గాంధీ భవన్ బోసిపోయింది.. తెలంగాణ భవన్ నిత్యం కళకళలాడుతోందని వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏప్రిల్ నెలతో బీఆర్ఎస్ పార్టీని స్థాపించి 24 ఏళ్ళు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతోందని అన్నారు. గత సంవత్సరం బీఆర్ఎస్ పార్టీకి అత్యంత గడ్డుకాలం అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: BIG BREAKING: ఆ గ్రామాలకు జిల్లాలు మార్పు! ఒక్క సీటు రాలేదు... ఇది కూడా చదవండి: రహాదారిపై కాంగ్రెస్ ఎంపీ అత్యుత్సాహం.. వాహనాలను ఆపి..! అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓడిపోయాము అని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని చెప్పారు. ఎమ్మెల్సీ కవితను ఐదు నెలలు జైల్లో పెట్టారని... పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు రాలేదని అన్నారు. పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే ఒక్కరు గెలవరని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై సంవత్సరంలోనే వ్యతిరేకత వచ్చిందని అన్నారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ కు ఆహ్వానం అందించిన మంత్రి పొన్నం..! ఢిల్లీ వరకు తీసుకువెళ్లాము.... లగచర్ల బాధితులను ఢిల్లీ వరకు తీసుకువెళ్లామని అన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచులు డిమాండ్ చేస్తున్నారని, అసెంబ్లీ సమావేశాల్లో మా గురించి మాట్లాడాలని ఆశా వర్కర్లు కలిశారని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యను లేవనెత్తుతాం అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు అభిమానం తగ్గలేదని అన్నారు. కాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయంగా మారింది. ఇది కూడా చదవండి: ఇదెక్కడి వింతరా బాబు.. బంగారు నగలతో పిల్లికి శ్రీమంతం.. మామూలుగా లేదుగా! ఇ ది కూ డా చ ద వం డి: ఇ దె క్క డి వింతరా బాబు.. బంగారు నగలతో పిల్లికి శ్రీమంతం.. మామూలుగా లేదుగా!