MLA KTR : కాంగ్రెస్ ప్ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. ఆశ వర్కర్లు చేస్తున్న సమ్మెను మద్దతు ప్రకటించారు. కరోనా లాంటి మహమ్మారి పరిస్థితిలో ఆశా వర్కర్లు పని చేశారని అన్నారు. మా ఉద్యోగ భద్రత, వేతనాలు పెంచాలని అడిగారు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామి నెరవేర్చాలని అడిగారు.. నిన్న ప్రొటెస్ట్ చేస్తే ఆశా వర్కర్లపై దాడి చేశారని మండిపడ్డారు. Also Read: చీటింగ్ కేసులో ప్రముఖ నటుడికి ఢిల్లీ కోర్టు నోటీసులు! Also Read : బిగ్ ట్విస్ట్! 20 లక్షల సూట్ కేస్‌తో అవినాష్ అవుట్? మిడ్‌వీక్ ఎలిమినేషన్ సిగ్గుందా ప్రభుత్వానికి... మగ పోలీసులు మహిళలను కొట్టారని చెప్పారు. హోమ్ శాఖ ఆయన సీఎం రేవంత్ చేతిలోనే ఉందని అన్నారు. లా అండ్ ఆర్డర్ ఉందా ఈ రాష్ట్రంలో అని నిలదీశారు. సిగ్గుందా ఈ ప్రభుత్వానికి అని నిప్పులు చెరిగారు. నిన్న జరిగింది దుశ్శాసన పర్వం అని అన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. ఈ పోలీసుల చర్యను వదిలిపెట్టం అని హెచ్చరించారు. మహిళా కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అవసరం అయితే జాతీయ మానవహక్కుల కమిషన్ ను కలుస్తామన్నారు. వారికీవ్వాల్సిన గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై అసెంబ్లీ లో కొట్లడుతాం అని అన్నారు. ఇక్కడ వైద్యం అందకపోతే తమ పార్టీ మీకు అండగా ఉండి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చెపిస్తాం అని అన్నారు. Also Read: Urfi Javed : ఉర్ఫీ మ్యాజికల్ గౌన్ పై నటి సమంత పోస్ట్.. వైరలవుతున్న వీడియో..! కేటీఆర్ ట్విట్టర్ లో... "పాలన కాదు పీడన ప్రజల వేదన అరణ్య రోదన రైతుల చెరబడితిరి పేదల ఇండ్లు కూలగొడ్తిరి రైతుబంధు ఎత్తేస్తిరి రైతుభీమాకు పాతరేస్తిరి కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ మాయం చేస్తిరి .. అమ్మవడిని ఆగం చేస్తిరి నిరుద్యోగుల ఉసురు పోసుకుంటిరి ఏక్ పోలీస్ అన్న పోలీసులను అణగదొక్కితిరి హామీల అమలు అడిగిన ఆడబిడ్డలు ఆశాలను అవమానపరిస్తిరి టీఎస్ టీజీగా చేసి చార్మినార్, కాకతీయ కళాతోరణాలను తొలగిస్తిరి తెలంగాణ బిడ్డలు లాఠీలకు, తూటాలకు ఎదురొడ్డి .. ఆత్మబలిదానాలతో ఉద్యమిస్తున్నప్పుడు .. సమైక్యవాదుల పంచనచేరి వంచన చేస్తిరి అధికార అహంకారంతో ఇప్పుడు ఏకంగా అమ్మనే మారిస్తిరి మీరు చరిత్రను చెరిపేస్తాం అన్న భ్రమలో .. తెలంగాణ ప్రజలను ఏమారుస్తాం అనుకుంటే పొరపాటు తెలంగాణ అన్నీ గమనిస్తున్నది కాలంబు రాగానే కాటేసి తీరుతుంది." అని ట్వీట్ చేశారు. Also Read : Rajendra Prasad: ఎర్ర చందనం దొంగ హీరోనా.. నోరు జారిన రాజేంద్రప్రసాద్!