KTR: రేపే అసెంబ్లీ సమావేశాలు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రైతుల తరపున అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ అన్నారు. గురుకులాల్లో ఉన్న దుర్భర పరిస్థితులపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఓ రిపోర్టు ఇచ్చామన్నారు. రాష్ట్ర సమస్యలపై పోరాడుతామని పేర్కొన్నారు.
తెలంగాణలో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలసిందే. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల తరపున అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గురుకులాల్లో ఉన్న దుర్భర పరిస్థితులపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఓ రిపోర్టు ఇచ్చామన్నారు. రైతులపై దాడులు చేస్తూ భూములు లాక్కుంటూ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే అడ్డుకుంటామని తేల్చిచెప్పారు.
'' మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. మూర్ఖంగా, అనాలోచితంగా, అసలు చరిత్ర గురించి తెలియకుండా ఏర్పాటు చేస్తున్న విగ్రహం గురించి అసెంబ్లీలో నిలదీస్తాం. మోసాలు చేసి ప్రజలకు అడ్డగోలు హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన మెనిఫెస్టోపై ఎండగడతాం. రాష్ట్ర సమస్యలపై పోరాడుతాం. రైతులందరికీ రుణమాఫీ అని చెప్పి అరకొరగా చేశారు. కొనుగోలు కేంద్రాలు సరిగా నడపలేని పరిస్థితి నెలకొంది. మళ్లీ ఇప్పుడు విజయోత్సవాల పేరుతో కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజల్ని మోసం చేస్తోందని'' కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ అంశంపై మాజీ సీఎం కేసీఆర్ కూడా స్పందించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడం మార్ఖత్వపు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా ? ఇలాంటి మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అంటూ మండిపడ్డారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేసీఆర్ తన ఎర్రవల్లి ఫార్మ్‌హౌస్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ పార్టీ నేతలను దిశానిర్దేశం చేశారు.

Also Read: ధరణిలో మార్పులు, కొత్త ఆర్‌వోఆర్ చట్టం.. పొంగులేటి కీలక వ్యాఖ్యలు
'' మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. మూర్ఖంగా, అనాలోచితంగా, అసలు చరిత్ర గురించి తెలియకుండా ఏర్పాటు చేస్తున్న విగ్రహం గురించి అసెంబ్లీలో నిలదీస్తాం. మోసాలు చేసి ప్రజలకు అడ్డగోలు హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన మెనిఫెస్టోపై ఎండగడతాం. రాష్ట్ర సమస్యలపై పోరాడుతాం. రైతులందరికీ రుణమాఫీ అని చెప్పి అరకొరగా చేశారు. కొనుగోలు కేంద్రాలు సరిగా నడపలేని పరిస్థితి నెలకొంది. మళ్లీ ఇప్పుడు విజయోత్సవాల పేరుతో కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజల్ని మోసం చేస్తోందని'' కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: సరిహద్దు భద్రత కోసం యాంటీ డ్రోన్ విభాగం : హోం మంత్రి అమిత్ షా
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ అంశంపై మాజీ సీఎం కేసీఆర్ కూడా స్పందించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడం మార్ఖత్వపు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా ? ఇలాంటి మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అంటూ మండిపడ్డారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేసీఆర్ తన ఎర్రవల్లి ఫార్మ్‌హౌస్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ పార్టీ నేతలను దిశానిర్దేశం చేశారు.
Also Read: ఢిల్లీలో రైతులపై పోలీసుల లాఠీఛార్జ్.. తర్వాత పూల వర్షం
Also Read: పిల్లలకు రోజూ ఇవి తినిపిస్తే చాణక్యుడిలా మారుతారు