Kiran Abbavaram: గుడ్ న్యూస్ చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం.. బాబు ఫొటోతో సోషల్ మీడియాలో పోస్ట్!
హీరో కిరణ్ అబ్బవరం గుడ్ న్యూస్ చెప్పారు. గురువారం రాత్రి తమకు బాబు పుట్టినట్లు తెలిపారు. ఈ శుభవార్తను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకున్నారు. బాబు కాలిని ముద్దాడుతూ దిగిన ఫొటోను షేర్ చేశారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.