/rtv/media/media_files/2025/05/23/YUX1JKCw9JmQ3iDW3uEh.jpg)
kiran abbavaram blessed with baby boy
Kiran Abbavaram: హీరో కిరణ్ అబ్బవరం, రహస్య దంపతులు అభిమానులకు శుభవార్త చెప్పారు. గురువారం రాత్రి రహస్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ బాబు ఫొటోను పంచుకున్నారు కిరణ్. బాబు కాలిని ముద్దాడుతూ కనిపించారు. 'రాజాగారు రాణివారు’లో సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన నటి రహస్య, కిరణ్ కొంతకాలం రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఆ తర్వాత 2024లో ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నారు.
కె- ర్యాంప్'
ఇదిలా ఉంటే ఉంటే.. కిరణ్ గతేడాది 'క'సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. పీరీయాడిక్ మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో విభిన్న కథాంశంతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం కిరణ్ 'కె- ర్యాంప్' సినిమాలో నటిస్తున్నాడు. ఇది కూడా మరో కొత్త జానర్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు.
telugu-news | latest-news | cinema-news | kiran-abbavaram | kiran-abbavaram-_-rahasya
Also Read: Cannes 2025: ఈ మిస్టరీ బుక్ లో ఏముంది?.. కేన్స్ లో మెగాస్టార్ 'విశ్వంభర' బుక్ విడుదల