K RAMP: కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ 'కే-ర్యాంప్' నుంచి మరో రొమాంటిక్ మెలడీ విడుదల చేశారు. ''కలలే కలలే'' అంటూ సాగిన ఈ పాట యూత్ ని బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో హీరోయిన్ యుక్తి తరేజా- కిరణ్ అబ్బవరం మధ్య రొమాంటిక్ సన్నివేశాలు అలరించాయి. చైతన్య భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి కపిల్ కపిలన్ పాడారు. భాస్కర్ భట్ల సాహిత్యం అందించారు. హాస్య మూవీస్, రుద్రాంష్ సెల్యులాయిడ్స్ బ్యానర్స్ పై నిర్మాత రాజేష్ దండా, శివ బొమ్మక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జైన్స్ నాని దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. వచ్చే నెల 25న థియేటర్స్ లో విడుదల కానుంది.
A Go-to tune to impress your loved one is loading...💖 #KRamp second single #KalaleKalale Promo Out Now 🎶😍
— Dileep Kumar Kandula (@TheLeapKandula) September 8, 2025
Full Song Out Tomorrow at 5:45 PM ❤️🔥
A @chaitanmusic musical🎶@Kiran_Abbavaram@realyukti@JainsNani@RajeshDanda_pic.twitter.com/bMIcNzZ6a7
టీజర్ పై విమర్శలు
ఇటీవలే 'కే-ర్యాంప్' టీజర్ విడుదల చేయగా.. అందులో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్, బూతులు ఉండడం పై ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. "చేటలు ఎల్లారుకూ నమస్కారం.. ఈసారి ఒక్కొక్కరికీ బుర్ర పాడు...*** జారుడే" అనే డైలాగ్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్ అయ్యింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం 'కుమార్' అనే పాత్రలో కనిపించబోతున్నాడు. పక్కా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కిరణ్ తనదైన మార్క్ కామెడీ, మాస్ డైలాగ్స్ తో అలరించనున్నట్లు గ్లిమ్ప్స్ వీడియో చూస్తే అర్థమైంది. రీసెంట్ గా 'క' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కిరణ్.. మరి ఈ సినిమాతో ఎలాంటి విజయం సాధిస్తాడో చూడాలి.
Also Read: Aa Naluguru: అప్పులు చేసి చనిపోతే ఊరంతా కదిలొచ్చింది..ఆ నలుగురు సినిమా వెనుక రియల్ స్టోరీ!