K RAMP Movie Trailer: నాన్‌స్టాప్ ఒకటే ర్యాంప్.. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పిచ్చెక్కిస్తున్న 'కె- ర్యాంప్‌' ట్రైలర్.. మీరు చూశారా?

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా కలిసి నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ 'కె- ర్యాంప్‌' దీపావళి సందర్భంగా అక్టోబర్ 18వ తేదీన థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ అయితే అదిరిపోయింది.

New Update
K RAMP Movie Trailer

K RAMP Movie Trailer

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా కలిసి నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ 'కె- ర్యాంప్‌' దీపావళి సందర్భంగా అక్టోబర్ 18వ తేదీన థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ అయితే అదిరిపోయింది. ఇంతకు ముందు సినిమా టీజర్, టైటిల్, పాటలు అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ముద్దులు, డబుల్ మీనింగ్‌లు, కామెడీ అన్ని సూపర్ గా ఉన్నాయని అంటున్నారు. ఈ ట్రైలర్ యూత్‌ను బాగా ఆకట్టుకుంది.

ఇది కూడా చూడండి: Karwa Chauth: వీడు మగడ్రా బుజ్జి.. ఇద్దరు భార్యలతో కలిసి కర్వా చౌత్ పండగ

ఇది కూడా చూడండి: NTR Viral Video: రాజీవ్ కనకాల పై ఎన్టీఆర్ సీరియస్.. బామ్మర్ది పెళ్ళిలో అలా చేశాడని!

ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం రిచ్చెస్ట్ చిల్లర వ్యక్తిగా ప్రవర్తిస్తాడు. ఏ ఏంగిల్‌లో కూడా కిరణ్ అబ్బవరం రిచ్‌గా ప్రవర్తించడం లేదని, చిల్లగా ప్రవర్తిస్తున్నావని స్నేహితులు అంటారు. అయితే డైరెక్టర్ మాస్ యాక్షన్, కామెడీ, లవ్, రొమాన్స్ ఇలా అన్ని కలిపి తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ అయితే పిచ్చెక్కించే విధంగా సూపర్‌గా ఉందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ మూవీలో హీరోయిన్ యుక్తి తరేజా బాయ్ ఫ్రెండ్‌ను కాస్త టార్చర్ పెట్టే విధంగా ఉన్నట్లు ట్రైలర్‌లో తెలుస్తోంది. ట్రైలర్ ప్రారంభంలో హాస్పిటల్ బయట కూర్చుని కిరణ్ కాళ్లు ఊపుతుంటే, పక్కనున్న బామ్మ 'కాళ్లు ఊపకూడదమ్మా, దరిద్రం' అని చెప్తుంది. దానికి కిరణ్ 'నేను ఊపట్లేదు బామ్మ. నా గర్ల్ ఫ్రెండ్‌ను తలుచుకుంటే వాటంతట అవే ఊగుతున్నాయి' అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది.

పీక్స్‌లో ఉన్న ట్రైలర్..

ఇక్కడే ట్రైలర్ హిట్ అయిపోయిందని చెప్పవచ్చు. ఈ ట్రైలర్‌లో కిరణ్ అబ్బవరం తన స్టైల్‌లో కామెడీ పంచ్‌లు, డైలాగ్‌లతో అదరగొట్టారు. మాస్ యాక్షన్, లవ్, అలకలు, కాలేజీ సరదాలు వంటి అంశాలను అన్నింటినీ కలిపి ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. జైన్స్ నాని దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఇదే. అయితే ఈ సినిమాలో నరేష్, సాయి కుమార్, వెన్నెల కిశోర్, మురళీధర్ గౌడ్, అలీ, శివన్నారాయణ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో నటించారు. చేతన్ భరద్వాజ్ ఈ మూవీకి సంగీతం అందించగా.. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు.

Advertisment
తాజా కథనాలు