Producer Rajesh Danda : ''లు*చ్చా నా కొ*డకా.. వాడిని ఉరి తీయాలి": 'కే-ర్యాంప్' నిర్మాత రాజేష్ బూతు పురాణం!

‘కె-ర్యాంప్’ నిర్మాత రాజేష్ దండా బూతులతో రెచ్చిపోయారు. తన మూవీపై ఓ వెబ్ సైట్ నెగిటివ్ రివ్యూలు ఇస్తుందని తెలిపారు. ''నీకు ఏం తెలుసురా లు*చ్చా నా కొ*డకా. తొక్కుతావా సినిమాని.. తొక్కురా నువ్ మగాడివైతే. ఈ నా కొ*డుకుని నడిరోడ్డు మీద ఉరి తీయాలి" అన్నారు.

New Update
Producer Rajesh Danda

Producer Rajesh Danda

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం 'కే-ర్యాంప్' (K-Ramp). ఈ మూవీ ఇటీవల విడుదలై మిక్స్డ్ టాక్ అందుకుంది. ఈ క్రమంలో రీసెంట్ గా మూవీ సక్సెస్ మీట్‌ నిర్వహించగా.. ఆ ఈవెంట్ లో నిర్మాత రాజేష్ దండా ఒక న్యూస్ వెబ్ సైట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బూతు పురాణం అందుకున్నారు. తన సినిమాకు నెగెటివ్ ప్రచారం చేస్తూ, తప్పుడు వసూళ్ల లెక్కలు రాసిందంటూ ఆ వెబ్‌సైట్ అధినేతను ఉద్దేశించి తీవ్ర పదజాలంతో దూషించారు.

K-Ramp Producer Rajesh Danda

'కే-ర్యాంప్' చిత్రం మంచి వసూళ్లు సాధించినప్పటికీ, ఒక ప్రముఖ వెబ్‌సైట్ తమ సినిమా కలెక్షన్లను తమిళ-తెలుగులో విడుదలైన 'డ్యూడ్' చిత్రంతో పోలుస్తూ తప్పుడు కథనాలను ప్రచురించిందని రాజేష్ దండా ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన సహనం కోల్పోయి బూతులతో రెచ్చిపోయారు. ఈవెంట్‌లో అందరూ ఉండగానే.. ఆ వెబ్ సైట్ అధినేతపై విరుచుకుపడ్డారు. చిన్న సినిమాల పట్ల రివ్యూలు, రేటింగ్‌ల విషయంలో పక్షపాతం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. '' మా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ ఒక వెబ్ సైట్ ఇంకా ఏడుస్తుంది. వాడికి చెబుతున్నా.. అమెరికాలో ఉన్న ప్రదీప్ గా పగలగొడతా.. నీకు ఏం తెలుసురా లు*చ్చా నా కొ*డకా. డూడ్ సినిమాకి 196k, నా సినిమాకి (కే-ర్యాంప్) 47k వేస్తున్నావ్. డూడ్ సినిమా తమిళ్-తెలుగురా కు*క్క. తొక్కుతావా సినిమాని.. తొక్కురా నువ్ మగాడివైతే. ఒక హిట్టు సినిమాని ఇంకా తొక్కాలని ఆర్టికల్ వేస్తున్నాడు వీడు. ఈ నా కొ*డుకుని ఏం చేయాలి. నడిరోడ్డు మీద ఉరి తీయాలి వీడ్ని. మా మీద బతికే నా కొ*డక." అంటూ బూతులతో రెచ్చిపోయారు. 

చిన్న నిర్మాత కాబట్టి ఏం చేసినా భరిస్తాడని అనుకుంటున్నారా?.. 'బాహుబలి' అయినా, 'కే-ర్యాంప్' అయినా ఒకేలా చూడాలి అని అన్నారు. 'కే-ర్యాంప్' మూవీ అందరూ నవ్వుకోవడం కోసమే తీసిన సినిమా అని, లాజిక్‌లు వెతకడానికి కాదని ఆయన స్పష్టం చేశారు. రాజేష్ దండా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. చాలా మంది ఆయన ఆవేదనను అర్థం చేసుకుని మద్దతు తెలుపుతుండగా, మరికొందరు మాత్రం బహిరంగ వేదికపై అంతటి తీవ్రమైన, బూతు పదజాలం వాడటం సరికాదని అభిప్రాయపడుతున్నారు. నెగెటివ్ ప్రచారంపై పోరాటం చేయడంలో తప్పు లేకున్నా, భాష విషయంలో సంయమనం పాటించాల్సిందిగా పలువురు సూచిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు